Begin typing your search above and press return to search.
చంద్రబాబు.. బీజేపీ.. పోల్చి మరీ పేర్ని నాని వేసిన పంచ్
By: Tupaki Desk | 28 Dec 2021 6:35 AM GMTఏపీ అధికార వైసీపీలో సందర్భానుసారం పంచులతో చీల్చి చెండాడగల మాటల మాంత్రికుడు పేర్ని నాని. ఆయన వేసే పంచులు బాగా పేలుతుంటాయి. జగన్ ను, వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించే వారిపై మంత్రి పేర్ని నాని వేసే కౌంటర్లు అదుర్స్ అనిపిస్తాయి. తాజాగా బీజేపీ తీరును పేర్ని నాని చీల్చిచెండాడాడు.
చంద్రబాబు ఎజెండానే బీజేపీ ఎజెండాగా అమలు చేస్తోందని మంత్రి పేర్ని నాని చెప్పుకొచ్చాడు. బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. చంద్రబాబు ఎజెండానే బీజేపీ ఎజెండా అని మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు.
జాతీయ పార్టీ కూటమిలో ప్రాంతీయ పార్టీలు ఉంటాయని కానీ బీజేపీ చంద్రబాబు కూటమిలో ఉందని పేర్ని నాని విమర్శించారు. బ్రాందీ ధరలు పెరిగినందుకు కాదు.. పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలు పెరిగినందుకు బీజేపీ నేతలు బాధపడాలని వ్యాఖ్యానించారు. రైతు వ్యతిరేక చట్టాలను మళ్లీ తెస్తామంటున్నారని మండిపడ్డారు.
జాతీయ స్థాయిలో బీజేపీ బాదుడును పక్కన పెట్టి ఏపీ ప్రభుత్వం ప్రజాసంక్షేమ పథకాలు అమలు చేస్తే వాటిపై విమర్శలు చేయడం ఏంటని మంత్రి నాని నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఏది చేపడితే అది పట్టుకొని బీజేపీ పోరాటం చేస్తోందని.. అసలు ఆ పార్టీకి సొంత ఎజెండా లేదంటూ తూర్పారపట్టారు.
రైతులను కేంద్రం ముంచేస్తోందని.. మోసం చేస్తోందని.. కానీ వైసీపీ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా వెళుతుందని పేర్ని నాని అన్నారు. బీజేపీ ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరుగుతోందని.. ముందు వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
బీజేపీ మేధావులంతా వైసీపీ ప్రభుత్వం అప్పులు చేస్తోందని విమర్శిస్తున్నారని.. మాకు ఎవరూ అప్పులు ఇవ్వడం లేదని అంటున్నారని.. బీజేపీ ప్రభుత్వం అప్పులు చేయడం లేదా? అని పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ప్రపంచదేశాలకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అప్పులు ఇస్తోందట అని సెటైర్ వేశారు.
కేంద్ర ఆర్థిక శాఖ, ఆర్బీఐ గైడ్ లైన్స్ కు లోబడి ఏపీ ప్రభుత్వం అప్పు తెస్తోందని పేర్నినాని క్లారిటీ ఇచ్చారు. అదే దేశంలోని ప్రభుత్వం 21శాతం అప్పు చేసిందని.. ఏపీ ప్రభుత్వం 3శాతం మాత్రమే చేసిందన్నారు.
యూపీఏ ప్రభుత్వం 2014కి 64 లక్షల కోట్లు అప్పు చేస్తే.. ఈ ఏడేళ్ల పాలనలో 1.35 కోట్ల లక్షల అప్పు బీజేపీ ప్రభుత్వం చేసిందని మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. బీజేపీ వాళ్లు ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి మాట్లాడుతారా? అని బీజేపీనేతలకు పేర్ని నాని గట్టి కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ఏదీ తీసుకుంటే అదే ఎజెండా తీసుకొని విమర్శలు చేసే ముందు బీజేపీ నేతలు ఒకసారి తమ గురించి తాము ఆత్మవలోకనం చేసుకోవాలని పేర్ని నాని హితవు పలికారు.