Begin typing your search above and press return to search.
నేనేం బూతులు మాట్లాడా? బీప్ లు వేశారా?: పవన్ కు పేర్ని నాని కౌంటర్
By: Tupaki Desk | 29 Sep 2021 3:30 PM GMTసినీ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై మెగా స్టార్ చిరంజీవి విభేదించారని.. విచారం వ్యక్తం చేశారని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. ఆన్ లైన్ టికెటింగ్ కొత్తగా పెట్టింది కాదని పేర్ని నాని అన్నారు. సినిమా ఇండస్ట్రీ ఆన్ లైన్ టికెటింగ్ కు అనుకూలంగా ఉందని తెలిపారు. ఆన్ లైన్ టికెటింగ్ కొత్తగా ప్రభుత్వం పెట్టింది కాదన్నారు. ఇప్పటికే ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థ నడుస్తోందని పేర్కొన్నారు. సినిమా టికెట్లపై నిర్ధిష్ట విధానం ఉండాలన్నారు. నిర్మాతల అభిప్రాయాలను సీఎం దృష్టికి తీసుకెళుతానని పేర్ని నాని చెప్పుకొచ్చారు.
ఏపీ మంత్రి పేర్ని నానితో టాలీవుడ్ నిర్మాతల బృందం భేటీ ముగిసింది. నిర్మాతలు దిల్ రాజు, డీవీవీ దానయ్య, బన్నీ వాసు, సునీల్ నారంగ్, వంశీరెడ్డి, మైత్రీ నవీన్ తాజాగా మచిలీపట్నంలో మంత్రి పేర్ని నానితో సమావేశమయ్యారు. ఆన్ లైన్ టికెట్ల అమ్మకంతోపాటు సినీ ఇండస్ట్రీలోని సమస్యలపై చర్చించారు.
అనంతరం మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ఆడియో ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై చిరంజీవి తనతో మాట్లాడారని గుర్తు చేశారు. పవన్ వ్యాఖ్యలపై చిరంజీవి విచారం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఒక వ్యక్తి మాటలను తామంతా ఏకీభవించడం లేదని చెప్పారు. ఒక వ్యక్తి మాటలను ఇండస్ట్రీ మాటలుగా తీసుకోబోమని తాను చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
దేశంలో కిరాయికి పార్టీ పెట్టింది పవన్ కళ్యాణ్ ఒక్కరేనని పేర్ని నాని మండిపడ్డారు. రాజకీయ పార్టీని టెంట్ హౌస్ లా అద్దెకు ఇస్తున్నారని పేర్ని నాని ఎద్దేవా చేశారు. తాను రెడ్లకు పాలేరును అని.. తాను జగన్మోహన్ రెడ్డికి పాలేరునని.. పవన్ ఎవరికి పాలేరు అని.. కమ్మలకు పాలేరా? అని నాని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్లు తిట్టడం సంస్కారమా? అని ఆయన ప్రశ్నించారు. పవన్ కు ఆయన తల్లి అంజనీదేవి సంస్కారం నేర్పలేదా? అని నాని ప్రశ్నించారు. నువ్వు ఎవరి పాలేరో చెప్పే ధైర్యం నీకు ఉందా? అని ప్రశ్నించారు.
సినిమా రంగం చాలా సున్నితమైందని నిర్మాత దిల్ రాజు అన్నారు. ఏదైనా జరిగితే ఇంపాక్ట్ అయ్యేది నిర్మాతలు అని తెలిపారు. తమ సమస్యలను ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నామని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సమస్యలను పరిష్కరిస్తున్నాయని తెలిపారు. రాజకీయం వల్ల సినీ పరిశ్రమ డ్యామేజ్ కాకుండా చూడాలన్నారు. అన్ని థియేటర్లు ఆన్ లైన్ విధానంలో రావాలని చెప్పారు.
ఈ క్రమంలోనే టాలీవుడ్ సమస్యలపై నిర్మాతలతో చర్చించిన మంత్రి పేర్ని నాని దీనిపై సీఎం జగన్ తో మాట్లాడి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. మరోసారి టాలీవుడ్ ప్రముఖులతో భేటి అవుతామని చెప్పారు.