Begin typing your search above and press return to search.

నిమ్మగడ్డ మాట‌లు చూస్తుంటే.. తిరుగుబోతు సామెత గుర్తొస్తోందిః మంత్రి

By:  Tupaki Desk   |   1 April 2021 8:30 AM GMT
నిమ్మగడ్డ మాట‌లు చూస్తుంటే.. తిరుగుబోతు సామెత గుర్తొస్తోందిః మంత్రి
X
మార్చి 31తో స‌ర్వీసు కాలం ముగియ‌డంతో ఉద్యోగ విర‌మ‌ణ పొందారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్. అయితే.. ఆయ‌న కుర్చీ దిగిపోయే ముందు ఎన్నిక‌ల విధివిధానాల‌పై గ‌వ‌ర్న‌ర్ కు లేఖ రాశారు. ఈ లేఖ‌పై మంత్రి పేర్ని నాని తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డ‌ట్టు స‌మాచారం. ప‌ద‌విలో ఉన్నంత కాలం చంద్ర‌బాబుకు సేవ చేసిన ఆయ‌న‌.. ఉద్యోగం ఊడిపోయే రోజున శ్రీరంగ నీతులు చెబుతున్నార‌ని వ్యాఖ్యానించిన‌ట్టు స‌మాచారం.

షెడ్యూల్ ప్ర‌కారం స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే.. చంద్ర‌బాబుకు ఓట్లు ప‌డ‌వ‌నే ఉద్దేశంతోనే.. ఎన్నిక‌లు వాయిదా వేశార‌ని ఆరోపించిన‌ట్టు స‌మాచారం. ఏడాది త‌ర్వాత నిర్వ‌హిస్తే.. ప్ర‌జ‌ల్లో ఏదైనా వ్య‌తిరేక‌త వ‌స్తే టీడీపీకి మేలు జ‌రిగే అవ‌కాశం ఉంద‌నే ఉద్దేశంతోనే ఎన్నికలు వాయిదా వేశార‌ని మంత్రి ఆరోపించిన‌ట్టు స‌మాచారం.

అలాంటి నిమ్మ‌గ‌డ్డ.. ఉద్యోగ విర‌మ‌ణ సంద‌ర్భంగా చెప్పిన నీత మాట‌లు చూస్తుంటే.. తిరుగుబోతు బ్ర‌హ్మ‌చ‌ర్యం గురించి పుస్త‌కం రాశాడ‌న్న సామెత గుర్తొస్తోందని అన్నారట మంత్రి. గవర్నర్ కు రాసిన లేఖలో.. నిష్ప‌క్ష‌పాతం, పార‌ద‌ర్శ‌క‌త వంటి ప‌దాల‌ను ఉప‌యోగించ‌డం న‌వ్వు తెప్పిస్తోంద‌ని అన్నారు.

నిమ్మ‌గ‌డ్డ‌-చంద్ర‌బాబు బంధాన్ని ప్ర‌జ‌లు గుర్తించార‌ని, అందుకే.. పంచాయ‌తీ, మునిసిప‌ల్‌ ఎన్నిక‌ల్లో కోలుకోలేని దెబ్బ కొట్టార‌ని మంత్రి అన్న‌ట్టు స‌మాచారం. హైద‌రాబాద్ లో ఉంటూ.. గుంటూరులో ఓటు హ‌క్కు కోర‌డంలోనే ఆయ‌న నైతిక బ‌య‌ట‌ప‌డింద‌ని మంత్రి అన్న‌ట్టు స‌మాచారం.