Begin typing your search above and press return to search.
బాలయ్య అమాయకుడు- మీ సోదరి ప్రస్తావన అసలు రాలేదు
By: Tupaki Desk | 20 Nov 2021 10:36 AM GMTఏపీ అసెంబ్లీలో, బయట శుక్రవారం జరిగిన వ్యవహారాలు వివాదాస్పదం అవుతుండడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. సమాచార శాఖ మంత్రి పేర్ని నాని శనివారం మీడియా సమావేశం నిర్వహించి అసలేం జరిగింది అనేదానిపై పూర్తి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలక్రష్ణ, ఏపీ సీఎం వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రస్తావన తెస్తూ మాట్లాడారు. మరోవైపు ఏపీ రాజకీయాల్లో నిన్నటి శుక్రవారాన్ని బ్లాక్ ఫ్రైడే గా పేర్ని నాని అభివర్ణించారు. రాజకీయాల కోసం ఇంతలా దిగజారుతారని అనుకోలేదని, ఈ స్థాయిలో అబద్ధాలు మాట్లాడడం కంటే దౌర్భాగ్యం మరోటి లేదన్నారు. వ్యవసాయంపై జరుగుతున్న చర్చను పక్కదారి పట్టించేందుకే టీడీపీ పక్కా ప్రణాళికతో వ్యవహరించిందని మంత్రి పేర్ని పేర్కొన్నారు.
భువనేశ్వరి ప్రస్తావన ఎక్కడ?
అసెంబ్లీలో శుక్రవారం నారా భువనేశ్వరి ప్రస్తావన ఎక్కడా రాలేదని పేర్ని నాని ప్రకటించారు. తన భార్యను కించపరుస్తూ మాట్లాడారంటూ చంద్రబాబు కన్నీటి పర్యంతం అయిన నేపథ్యంలో.. ఆయన బావమరిది బాలక్రష్ణ , నందమూరి కుంటుంబం మీడియాకు ముందుకు రావడంతో పేర్ని నాని స్పందించారు. బాలయ్య అమాయకుడని, చంద్రబాబు మాటలు నమ్మొద్దని సూచించారు. బాబు మాటలు నిజమని భావించడం బాధాకరమన్నారు. జన్మనిచ్చిన ఎన్టీఆర్ గురించే వారి వారసుల బుర్రల్లోకి విషం ఎక్కించిన నేర్పరి అంటూ చంద్రబాబును విమర్శించారు. అలాంటి చంద్రబాబుకు .. తాము అనని మాటలను అన్నట్లు చెప్పడం చాలా చిన్న విషయమంటూ పేర్ని నాని విమర్శించారు. కాగా, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి ట్వీట్ చేశారని.. చంద్రబాబు చెప్పింది నమ్మొద్దని నాని సూచించారు. భువనేశ్వరిని ఎవరూ ఏమీ అనలేదని మంత్రి మరోసారి తేల్చి చెప్పారు. భువనేశ్వరి పస్తావనే సభలో రాలేదని, శాసన సభ్యులు ఏదో అన్నారని లేని పోని వివాదం రగల్చడం, నమ్మించడ చూస్తుంటే చంద్రబాబు రాజకీయంగా ఏ స్థాయికి దిగజారారో అర్దం అవుతుందని మంత్రి చెప్పుకొచ్చారు.
అందరికీ తల్లీ భార్య ఉన్నారు..
సభలోని సభ్యులందరికీ భార్య, తల్లి, సోదరి ఉన్నారని ఎవరూ అనుచితంగా మాట్లాడరని పేర్ని నాని చెప్పుకొచ్చారు. అసలు ఏమీ జరుగకున్నా ఏదో జరిగినట్టు విషయాన్ని రాజకీయంగా వాడుకోవడం సరికాదన్నారు. చంద్రబాబు కన్నీటి ఎపిసోడ్ అంతా నాటకమని మంత్రి అభివర్ణించారు.
వీడియో ఫుటేజీ చూస్తే తెలుస్తుందిగా..
అసలేం జరిగిందో తెలియాలంటే.. అసెంబ్లీలో శుక్రవారం నాటి మొత్తం వీడియో ఫుటేజీ చూసుకోవచ్చని పేర్ని నాని ప్రకటించారు. సీఎం సభలో లేకపోయినా.. ఆయన గురించి చంద్రబాబు మాట్లాడారన్నారు. బాబాయ్ హత్య... గొడ్డలి.. తల్లి.. చెల్లి గురించి చర్చిద్దామని అన్నది చంద్రబాబు కాదా? అంటూ మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబుకు అవమానం జరిగిందంటూ టీడీపీ నిరసనలకు పిలుపు ఇస్తోందని ఎందుకు నిరసనలు? అని పేర్ని నాని ప్రశ్నించారు.
జగన్ కు దేవుడే అండగా నిలవాలి
చంద్రబాబు రాజకీయంగా పాతాళం లోకి జారిపోతున్నారని పేర్ని వ్యాఖ్యానించారు. ఆయన అసత్యాలు ప్రచారం చేయటంలో మొనగాడన్నారు. దుర్మార్గ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి సమయంలో జగన్ కు దేవుడే అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. అసెంబ్లీలో బూతులు మాట్లాడే సంప్రదాయం తెచ్చింది చంద్రబాబు అని మంత్రి పేర్ని నాని చెప్పుకొచ్చారు.