Begin typing your search above and press return to search.
వన్ అండ్ ఓన్లీ కొడాలి : మనకు ఫ్యాన్స్ ఎక్కువమ్మా...?
By: Tupaki Desk | 30 Jun 2022 11:30 AM GMTఈ మధ్యనే సర్కార్ వారి పాట మూవీలో మహేష్ బాబు అంటారు. మనకు ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉన్నారని. అలాంటి రాజకీయ అదృష్టవంతుడు ఒకరు ఉన్నారు. ఆయనే గుడివాడ ఎమ్మెల్యే, వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని. ఆయనను రియల్ హీరో అంటున్నారు ప్రియమైన మిత్రుడు మాజీ మంత్రి పేర్ని నాని. కొడాలి నానికి ఫ్యాన్స్ ఎక్కువమ్మా అని పేర్ని నాని ఉన్న విషయాన్ని అలా చెప్పేస్తున్నారు.
వెండితెర హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీయార్ ల కంటే కూడా ఎక్కువ మంది ఫ్యాన్స్ ఒక్క కొడాలి నానికే ఉన్నారని ఒక రేంజిలో పొగిడేశారు. ఇదంతా గుడివాడలో జరిగిన వైసీపీ ప్లీనరీలోనే జరిగింది. కొడాలి దోస్తీగా ఆ ప్లీనరీకి హాజరైన పేర్ని నాని చాలానే చెప్పారు.
కొడాలి నానిని తాను రాజకీయాల నుంచి వచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నానని, ఆయన రూటే సెపరేట్ అనేశారు. ఆయనకు ఉన్న స్నేహితులలో తానూ ఒకరిని కావడమే తన లక్ అని కూడా చెప్పుకున్నారు. ఇక మాస్ లో నానికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది అని పేర్ని ఎత్తేశారు. ఆయన ఫాలోయింగ్ ని తట్టుకోవడం, ఓవర్ టేక్ చేయడం ఎవరి తరం కాదు అని కూడా పేర్ని అంటున్నారు.
ఏపీ రాజకీయాల్లోనే ఆయన నిజమైన హీరో అని పేర్ని నాని అన్నారూ అంటే అపుడు కొడాలి నాని అభిమానుల కేరింతలు ఆగుతాయా. ఇక కొడాలి ఫ్యాన్స్ లో ముందు వరసలో నాని కూడా ఉన్నట్లున్నారు. అందుకే ప్లీనరీలో కొడాలి మాట్లాడుతూంటే ఆయన మీద గులాబీ రేకులు చల్లి తన ముచ్చటను తీర్చుకున్నారు.
ఇక కొడాలి నాని ఏమైనా తక్కువ మాట్లాడుతారా. పేర్ని నాని గురించి ఆయన కూడా బాగానే పొగిడారు. తనకు ఉన్న మంచి స్నేహితులలో పేర్ని నాని ఒకరని అన్నారు. తనకు ఎపుడూ అందుబాటులో ఉండే డియరెస్ట్ నియరెస్ట్ ఫ్రెండ్ అని కూడా కితాబు ఇచ్చారు.
ఇలా పేర్ని నాని కొడాలి నాని ఒకరిని ఒకరు పొగుడుకుని వైసీపీ క్యాడర్ అటెన్షన్ అంతా తమ వైపు తిప్పుకున్నారు. ఈ ఇద్దరు నానీలకు ఒక ప్రత్యేకత ఉంది. కొడాలి నాని మాటల్లో దూకుడు ఉంటుంది. ఆయన సూటిగానే గుచ్చేస్తారు. తెలుగుదేశాన్ని చంద్రబాబుని చీల్చి చెండాడాలీ అంటే అది కొడాలి నాని వల్లనే అన్న బ్రాండ్ అయితే ఏపీలో ఉంది. ఇక పేర్ని నాని ఏమీ తక్కువ కాదు. ఆయన మాటల్లో వెటకారం పాలు ఎక్కువ.
ఆయన గురి అంతా జనసేనాని పవన్ కళ్యాణ్ మీదనే. పవన్ మాటలకు కౌంటర్ ఇవ్వడంతో పేర్ని ఎపుడూ ముందు వరసలో ఉంటారు. ఇలా ఇద్దరు నానీలు మూడేళ్ళ పాటు మంత్రులుగా చేసి ఏపీ మీడియా ముందు బిగ్ సౌండ్ చేస్తూ వచ్చారు. ఇపుడు మాజీలు అయినా తామే టాప్ రేసులో ఉన్నామంటూ గట్టిగా చెప్పుకుంటున్నారు. మొత్తానికి కొడాలి నాని ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక్క లెక్కన ఉందని పేర్ని చెప్పారంటే నమ్మాల్సిందే కదా.