Begin typing your search above and press return to search.
సుజనాచౌదరి కాల్ లిస్ట్‌లో సంచలన నిజాలు?
By: Tupaki Desk | 23 Nov 2019 3:18 AM GMTతెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఆప్తుడిగా పేరొంది...ఆ పార్టీ వల్ల రాజ్యసభ సభ్యుడి అవకాశం దక్కించుకొని....కేంద్రమంత్రి పదవిని సైతం సొంతం చేసుకున్న సుజనా చౌదరి అదే చంద్రబాబుకు షాకిస్తూ...పార్టీకి గుడ్‌బై చెప్పేయడమే కాకుండా...ఏకంగా రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేయించారు. కాషాయకండువా కప్పుకొన్నారు. ఇటీవలి కాలంలో ఆయన ఏపీలో అధికారపక్షమైన వైసీపీపై ఒకింత ఘాటుగా స్పందిస్తున్నారు. దీనిపై తాజాగా వైసీపీ ఘాటుగా స్పందించింది.
ఏపీ సమాచార శాఖా మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ..సుజనా చౌదరిపై విరుచుకుపడ్డారు. పేరుకు బీజేపీ అనే ముసుగువేసుకున్నప్పటికీ... బాబుగారి భజనలో సుజనా చౌదరి బిజీగా ఉంటారని మండిపడ్డారు. బీజేపీ గతంలో సిద్ధాంతాల పార్టీగా పేరుండేదని సుజనాచౌదరి లాంటి వారిని చేర్చుకున్న తర్వాత ఆ పేరు పోయిందన్నారు. ``సుజనా చౌదరిగారు...మాకున్న ఒప్పందాల గురించి మాట్లాడేముందు...మీరు పార్టీ మారిన దగ్గర్నుంచి కాల్ డేటా లిస్ట్ చూపండి. రోజూ మీరు ఎవరితో మాట్లాడుతున్నారు...ఎవరితో తెరచాటు రాజకీయాలు చేస్తున్నారు. ఒప్పందాలు ఏంటనేది తెలిసిపోతుంది.`` అని వ్యాఖ్యానించారు.
సుజనాచౌదరి గడిచిన జీవితం ఎలా ఉన్నా ఇప్పుడు ఆయన బాధ్యతగా మెలగాలని పేర్ని నాని వ్యాఖ్యానించారు. ``మీ రాజకీయ జీవితంపై ఎన్నో మచ్చలు ఉన్నాయి. బ్యాంకులకు టోపీలు పెట్టిన పేరుంది. కేంద్ర మంత్రి అయిన తర్వాతైన మీరు మారాల్సింది. మారలేదు. బాధ్యతాయుత మంత్రిగా చేసిన తర్వాత అయినా మీ తత్వం, మీ నడవడిక, ఆలోచన మారాలి. కానీ మీరు అంతకంతకు దిగజారేలా ప్రవర్తిస్తున్నారు. తీరు మార్చుకోండి.మార్చుకోం..అంటే అదీ మీ విజ్ఞతకే వదిలివేస్తున్నాం.`` అని వ్యంగ్యంగా మాట్లాడారు.ఇంగ్లిష్ మీడియం గురించి సుజనాచౌదరి మాట్లాడటం చిత్రంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. `మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? మీ పిల్లలను ఎందుకు తెలుగులో చదవించలేదు? కన్నాలక్ష్మీనారాయణ,సుజనాచౌదరి వీరి విధానం ఏంటో అర్దం కావడం లేదు.`` అని ఎద్దేవా చేశారు.