Begin typing your search above and press return to search.
తాను సీఎం జగన్ పాలేరునని ఒప్పుకున్న పేర్ని నాని
By: Tupaki Desk | 30 Sep 2021 6:40 AM GMTజనసేన అధినేత పవన్ కల్యాణ్ వర్సస్ వైసీపీ నేతల మధ్య నడుస్తున్న పంచాయితీ మరో మలుపు తిరిగింది. వైసీపీ మంత్రి పేర్ని నానిపై పవన్ కల్యాణ్ ఘాటు విమర్శలు చేయటంతో పాటు.. ‘సన్నాసి’ అంటూ తప్పు పట్టిన ఉదంతంపై ఇప్పటికే పలుమార్లు మాట్లాడిన మంత్రి పేర్ని నానిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు.. ఘాటైన పదజాలంతో కూడిన వీడియోలు అప్ లోడ్ అవుతున్నాయి. సీఎం జగన్ పాలేరుగా మారినట్లుగా ఆయన్ను తప్పు పడుతున్న ట్రోలింగ్ పైన తాజాగా స్పందించారు.
తాజాగా మచిలీపట్నంలోని ఆర్ అండ్ బీ గెస్టు హౌస్ లో జరిగిన సమావేశానికి మంత్రి పేర్ని నానిని.. సినీ రంగానికి చెందిన పలువురు నిర్మాతలు ఆయన్ను కలిశారు. వారిలో దిల్ రాజు.. డీవీవీ దానయ్య.. బన్నీ వాసు.. సునీల్ నారంగ్.. వంశీరెడ్డి తదితర నిర్మాతలు.. ఎగ్జిబిటర్లు ఉన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పేర్ని నాని ఘాటుగా రియాక్టు అయ్యారు.
పవన్ కల్యాణ్ తనను పాలేరుగా అభివర్ణించారని.. తాను నిజంగానే ముఖ్యమంత్రి జగన్ కు పాలేరునంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఈ విషయాన్ని షంషేరుగా చెబుతున్నా. మరి.. పవన్ ఎవరికి పాలేరు? కమ్మవారికి పాలేరువా? మాపై నోరు జారితే వెంటనే వాత పెడతానని.. అవమానిస్తే తిరిగి అవమానిస్తా. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఏరా.. ఒరేయ్.. అంటావా? ఇదేనామీ అమ్మ అంజనా దేవి నీకు నేర్పిన సంస్కారం? పవన్ కల్యాణ్ ను నేను బూతులు తిట్టలేదు. అందుకే టీవీల్లో బీప్ లులేకుండా ప్రసారం చేశారు’ అంటూ వ్యాఖ్యానించారు. విమర్శలకు ప్రతివిమర్శలు ఓకే. కానీ.. అందులోకి సంబంధం లేని వారి ప్రస్తావన తేవటం కరెక్టు కాదో.. వారి పేర్లను ప్రస్తావించటం ఇబ్బందికి గురి చేస్తుంది.
తాజాగా పేర్ని నాని అలాంటి పనే చేశారన్న మాట వినిపిస్తోంది. పవన్ పై విమర్శలు చేయటాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ.. ఆయనకు కౌంటర్ ఇచ్చే క్రమంలో తల్లి అంజనాదేవి పేరును ప్రస్తావించాల్సిన అవసరం లేదన్న మాట వినిపిస్తోంది. ఇలాంటివేళ.. పేర్ని నానిని ఉద్దేశించి విమర్శించే క్రమంలో ఆయన తండ్రి కమ్ మాజీ మంత్రి ప్రస్తావన తెచ్చారన్న మాట రావొచ్చు. కానీ.. అవన్నీ పవన్ తరఫున మద్దుతుగా మాట్లాడే వారు మాట్లాడిందే తప్పించి.. పవన్ నేరుగా మాట్లాడింది కాదు.
అయినా.. మంత్రి పదవిలో ఉన్న పేర్ని నాని.. తనను విమర్శించే వారిని ఎంత దారుణంగా అయినా విమర్శలు చేయొచ్చు. కానీ.. ఎప్పుడూ రాజకీయాలు కాదు కదా.. జనజీవన స్రవంతిలో ఒక్క మాట అంటే ఒక్క మాట మాట్లాడని పవన్ కల్యాణ్ తల్లి అంజనాదేవి ప్రస్తావనను.. మంత్రి పేర్ని నాని స్వయంగా తీసుకురావటం సరికాదన్న వాదన వినిపిస్తోంది.