Begin typing your search above and press return to search.
పవన్ కుక్క అంటే.. నాని ‘పంది’ అనేశాడు
By: Tupaki Desk | 28 Sep 2021 6:32 AM GMTనువ్వు తమలపాకుతో ఒకటంటే.. తలుపు చెక్కతో రెండిచ్చినట్లుగా తయారైంది యవ్వారం. ‘రిపబ్లిక్’ ప్రీరిలీజ్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన పవన్ కల్యాణ్.. వైసీపీ నేతల్ని.. మరీ ముఖ్యంగా మంత్రి పేర్ని నానిని ఉద్దేశించి ‘సన్నాసి’ అంటూ ఒకటికి పదిమార్లు సంబోధించటం.. ఇది కాస్త పెను సంచలనంగా.. వివాదంగా మారటం తెలిసిందే. ఇప్పటికే వైసీపీ నేతలపై విరుచుకుపడిన పవన్ కల్యాణ్ పై.. ఏపీ అధికార పక్ష నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
తన ఘాటు విమర్శలకు వైసీపీ మంత్రుల రియాక్షన్ నేపథ్యంలో.. ఇచ్చిన హామీలు.. చేస్తున్న పనుల మధ్య వైరుధ్యం ఎంతన్న విషయాన్ని తెలిపేలా ఒక భారీ ఇమేజ్ ను తయారు చేసిన పవన్ దాన్ని ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే పవన్ తీరును తీవ్రస్థాయిలో తప్పు పడుతూ.. నటుడు కమ్ జగన్ వీరాభిమానిగా తనకు తాను చెప్పుకునే పోసాని క్రిష్ణ మురళి ప్రెస్ మీట్ పెట్టి మరీ విరుచుకుపడ్డారు.
పవన్ తీరును తప్పు పట్టటమే కాదు.. చిరంజీవిలోని గుణాల్ని ప్రస్తావిస్తూ.. పవన్ ను తిట్టిపోశారు. పనిలో పనిగా పంజాబీ అమ్మాయికి అవకాశాల పేరుతో అబార్షన్ చేయించిన వైనాన్ని ప్రస్తావిస్తూ.. ఆమెకు న్యాయం చేస్తే.. పవన్ కు గుడి కడతానంటూ సవాలు విసిరారు. పోసాని వ్యాఖ్యలు సంచలనంగా మారిన నేపథ్యంలో పవన్ చేసిన ట్వీట్ స్పందన వాతావరణాన్ని మరింత ఘాటెక్కేలా చేసింది. వైసీపీ గ్రామసింహాల గోంకారాలు సహజమే అంటూ.. వైసీపీ నేతల్నిఊర కుక్కలుగా అభివర్ణిస్తూ పవన్ చేసిన ట్వీట్ పై ఏపీ అధికారపక్ష నేతలకు మంట పుడుతోంది.
దీనికి తగ్గట్లే పవన్ ట్వీట్ కు ధీటుగా మంత్రి పేర్ని నాని కౌంటర్ ట్వీట్ చేశారు. పవన్ తీరును తప్పు పడుతూ.. ఆయన వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపిస్తూ.. ‘జనం ఛత్కారాలు.. ఓటర్ల తిరస్కారాలు.. తమరి వైవాహిక సంస్కారాలు.. వరహ సమానులకు న‘మస్కా’ రాలు అంటూ పవన్ ను ఉద్దేశించి నేరుగా అనాల్సిన మాటను అనేశారు. ఇలా ఒకరు కుక్క అంటే మరొకరు పంది అనుకోవటం చూస్తుంటే.. ఈ జగడం రానున్న రోజుల్లో మరింత ముదరటం ఖాయమంటున్నారు.