Begin typing your search above and press return to search.
పవన్ కు చాకిరేవే
By: Tupaki Desk | 27 Sep 2021 5:43 AM GMTఓ సినిమా ఫంక్షన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా శనివారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలపై మంత్రి పేర్నినాని చాకిరేవుపెట్టారు. సినిమా ఫంక్షన్ లో పాల్గొన్న పవన్ వచ్చిన పనేదో చూసుకుని ఫంక్షన్ కు సంబంధించిన విషయానికి మాత్రమే పరిమితమైతే బాగుండేది. ఎలాగూ సందర్భమే కాబట్టి సినిమా సమస్యలను పరిష్కరించమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఇబ్బంది ఉండేదికాదు. కానీ పవన్ మాత్రం సినిమా ఫంక్షన్లో ప్రభుత్వంపై రాజకీయపరమైన ఆరోపణలు చేశారు.
అంతటితో ఆగకుండా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి, మంత్రి పేర్నినానిని నోటికొచ్చినట్లు మాట్లాడారు. దాంతో ఆదివారం ఉదయం నుండే మంత్రులు పవన్ పై ఎదురుదాడి మొదలుపెట్టటేశారు. అందరికన్నా హైలైట్ ఏమిటంటే పేర్నినాని పెట్టిన చాకిరేవనే చెప్పాలి. ఎదుకంటే సంబంధంలేకుండా తనను, జగన్ను జనసేన అధినేత డైరెక్టుగా ఎటాక్ చేయటంతో మంత్రికి బాగా మండిపోయింది.
అందుకనే సహజత్వానికి భిన్నంగా పవన్ పై నాని కూడా గట్టిగానే ఒకింత హద్దులు దాటి చాలా ఘాటుగా రిప్లై ఇచ్చారు. తమపైన ప్రభుత్వంపైన పవన్ చేసిన ప్రతి ఆరోపణకు పాయింట్ బై పాయింట్ మంత్రి సమాధానమిచ్చారు. కోడి కత్తి విచారణను ఎన్ఐఏ చేస్తోంది కాబట్టి ఎన్ఐఏని అడిగితే సమాధానం వస్తుందన్నారు. సినిమా టికెట్ల అమ్మకానికి ప్రభుత్వం పోర్టల్ పెట్టే విషయమై సినిమా పెద్దలే ప్రభుత్వాన్ని రిక్వెస్టు చేసిన విషయాన్ని చెప్పారు.
2003 నుండి ప్రభుత్వానికి ఎంతమంది రిక్వెస్టు చేశారనే విషయాన్ని రిక్వెస్టు చేసిన వారి పేర్లు, హోదాలతో సహా మీడియాసమావేశంలో చదివి వినిపించారు. విషయంఏదైనా జగన్ విషయంలో పవన్ ఎలా వ్యవహరిస్తున్నది, కేసీయార్, మోడి, అమిత్ షా విషయంలో ఎలా వ్యవహరిస్తున్నది ఉదాహరణలతో సహా వివరించారు. మోడి, అమిత్, కేసీయార్ ముందు పవన్ ఎలా ఒదిగి ఉంటారో అందుకు కారణాలను కూడా చెప్పారు. జగన్, తనపై పవన్ చేసిన ఆరోపణలు ఏ విధంగా తప్పో కూడా మంత్రి చెప్పారు.
పనిలోపనిగా చంద్రబాబునాయుడుతో పవన్ కున్న సంబంధాలను కూడా వివరించారు. చంద్రబాబుతో కలిసి పనిచేయదలచుకుంటే ఎవరికీ ఇబ్బంది లేదని చేసేదేదో బాహాటంగానే చెప్పే చేయచ్చన్నారు. ఒక నియోజకవర్గంలో గెలిచిన తాను సన్నాసా లేకపోతే రెండుచోట్ల పోటీచేసి రెండోచోట్లా ఓడిపోయిన పవన్ సన్నాసో చెప్పాలని ఎదురు ప్రశ్నించారు. తాను పవన్ కాపులమే కాకుండా బంధువులం కూడా అంటు గట్టిగానే రిటార్ట్ ఇచ్చారు.
ఏదేమైనా జగన్నో లేదా మంత్రులనో ఏదో ఒకటి అనటం, మళ్ళీ తిరిగి వాళ్ళతో అనిపించుకోవటం పవన్ కు బాగా అలవాటైపోయినట్లుంది. మైకు పట్టుకుంటే పూనకం వచ్చినట్లు సబ్జెక్టుకు సంబంధంలేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడటం పవన్ కు అలావాటే. మాట్లాడేదానిలో లాజిక్ ఉండదు, సబ్జెక్టు కూడా ఉండదు. అందుకనే ప్రభుత్వానికి, జగన్ కు వ్యతిరేకంగా పవన్ ఇంత మాట్లాడినా సినిమా పెద్దల నుండి ఎక్కడా మద్దతు దొరకలేదు. అందుకనే పవన్ తిక్క మాటలకు మంత్రే సమాధానం చెప్పారు.