Begin typing your search above and press return to search.
తెలంగాణ భవన్‌లో కరోనా అలజడి !
By: Tupaki Desk | 24 Jun 2020 12:30 PM GMTదేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో పనిచేసే ఒకరికి వైరస్ పాజిటివ్ గా వచ్చినట్టు ప్రసారమాధ్యమాల్లో ప్రచారం అవుతుంది. నిర్ధారణ అయింది. దీనితో వెంటనే అతన్ని వెంటనే అధికారులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారని, అలాగే అక్కడ ఇంకెవరికైనా వైరస్ సోకుతుందన్న భయంతో కార్యాలయాన్ని పారిశుద్ధ్య సిబ్బంది శానిటేషన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది.
మరోవైపు , వైరస్ సోకిన వ్యక్తి కుటుంబంలో మరో ఇద్దరికీ కూడా వైరస్ పాజిటివ్ గా వచ్చిందని , వారిని కూడా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని తెలుస్తుంది.
అలాగే, వారు సన్నిహితంగా మెలిగిన వారు ఎవరెవరనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. వారందరిని ఇంటి వద్దే ఉండాలని సూచించారు. తాజాగా వైరస్ సోకిన వ్యక్తితో కలిపి ఢిల్లీ తెలంగాణ భవన్ లో మొత్తం ముగ్గురు సిబ్బందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిసింది.
ప్రస్తుతం యాభైశాతం సిబ్బందితో మాత్రమే తెలంగాణ భవన్‌లో అధికారులు పని చేస్తున్నారు. వైరస్ సోకిన వ్యక్తి యొక్క ప్రైమరీ కాంటాక్ట్స్ ను పరీక్షలు నిర్వహించేందుకు వైద్యాధికారులు సిద్ధమయ్యారు. హోంశాఖ మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. గత నెల మే లో ఢిల్లీలో పనిచేస్తున్న ముగ్గురు తెలంగాణ ప్రాంతానికి చెందిన జర్నలిస్టులకు వైరస్ సోకింది. ఢిల్లీలో పనిచేస్తున్న జర్నలిస్టులకు వైరస్ సోకిన విషయాన్ని తెలుసుకొన్న తెలంగాణ మంత్రి కేటీఆర్ జర్నలిస్టులకు సరైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.