Begin typing your search above and press return to search.

పన్నీర్ వెనకున్నది ఎవరో రివీలైంది

By:  Tupaki Desk   |   13 Feb 2017 3:11 PM GMT
పన్నీర్ వెనకున్నది ఎవరో రివీలైంది
X
వీర విధేయుడిగా వ్యవహరించటమే కాదు.. అంతకు మించి మరోలా ఆలోచించటం కూడా తప్పేనన్నట్లుగా వ్యవహరించిన పన్నీర్ సెల్వం.. చిన్నమ్మ మీద తిరుగుబాటు బావుటా ఎగురవేయటమే కాదు.. చిన్నమ్మకంట కన్నీరు పెట్టించేలా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. పార్టీ ఆఫీసుకు కూడా వెళ్లకుండా పార్టీకి చీఫ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే రాజసం నుంచి.. తనకు జై కొట్టే ఎమ్మెల్యేల వద్దకు రోజూ వెళుతూ.. గంటల కొద్దీ సమయం వారితో గడిపి.. ఒక్కొక్కరిని ప్రాధేయపడే వరకూ వ్యవహారం వెళ్లింది.

ఇలాంటి పరిణామాలన్నీ పన్నీర్ పుణ్యమేనని చెప్పకతప్పదు. రాజసం ఉట్టిపడేలా స్థాయి నుంచి బతిమిలాడుకునే దైన్యానికి చిన్నమ్మను తీసుకొచ్చిన ఘనత పన్నీర్ దే. మరి.. ఇంత పని పన్నీర్ వల్లనే అవుతుందా? అంటే.. కాదనే చెప్పాలి. పన్నీర్ వెనుక ఉన్న అండ మోడీ సర్కారు అన్న మాట వినిపించినా.. దానికి తగిన సాక్ష్యాలుఇప్పటివరకూ లభించలేదు. అదే సమయంలోపన్నీర్ కదిపే పావుల వెనుక ఎవరు ఉన్నారన్న విషయం గడిచిన మూడు రోజులుగా చోటు చేసుకుంటున్నపరిణామాలతోస్పష్టంగా తెలిసిపోతోంది.

తమిళనాడు రాజకీయ వ్యవహారాల్ని ప్రత్యేకంగా చూస్తున్న మీడియా వర్గాల సమాచారం ప్రకారం.. పన్నీర్ ను నడిపిస్తున్న శక్తులు ఎవరో కాదని.. ఆయనకు మద్దతుగా నిలిచిన అన్నాడీఎంకే సీనియర్ నేతలనే చెబుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కో వ్యవహారం మీద దృష్టి పెట్టి పనులు పూర్తి చేయటమే కాదు.. చిన్నమ్మకు చుక్కలు చూపిస్తున్నట్లుగా చెబుతున్నారు. పన్నీర్ వెనుక ఉండి ఆయన్ను నడిపిస్తున్న ప్రముఖలు ఎవరు? వారేం చేస్తున్నారన్న విషయాన్ని చూస్తే..

1. వి. మైత్రేయన్: గవర్నర్ తో సంప్రదింపులు.. చర్చలకు సంబంధించిన అన్ని వ్యవహారాల్ని పర్యవేక్షిస్తున్నారు.

2. కెపి. మునుస్వామి: శశికళ.. ఆమె కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యవహారాల్ని బయటకు తెచ్చే బాధ్యత.

3. పాండిరాజన్: శశికళ వర్గంలోని ఎమ్మెల్యేలతో సంప్రదింపులు.. పన్నీరు శిబిరంలోకి తీసుకొచ్చే ఏర్పాట్లు.

4. ఆర్ విశ్వనాథన్: పార్టీ అంతర్గత వ్యవహారాలు.. వ్యూహ ప్రతివ్యూహాల నిర్ణయాల్లో కీలక భూమిక.

5. పీహెచ్ పాండ్యన్: మాజీ స్పీకర్ గా ఉన్న అనుభవంతో రాజ్యాంగ పరంగా ఎదురయ్యే సమస్యల నుంచి గట్టెక్కించటం.

6. ఈ.మధుసూదన్: సుదీర్ఘకాలంగా అన్నాడీఎంకేలో ఉన్న ఈ నేత.. పార్టీ నేతలతో సంప్రదింపులు. పన్నీర్ ను సీఎంను చేసే ప్రయత్నాలు.

7. సి.పొన్నయన్: న్యాయపరమైన విషయాల్ని డీల్ చేయటం. పన్నీర్ కు న్యాయపరమైన సమస్యల నుంచి కాపాడే వ్యూహాలు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/