Begin typing your search above and press return to search.

పోలవరం పనులు ఆపేందుకు వెనుక ఉన్నది ఎవరంటే?

By:  Tupaki Desk   |   1 Nov 2019 8:49 AM GMT
పోలవరం పనులు ఆపేందుకు వెనుక ఉన్నది ఎవరంటే?
X
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పలు సంచలనమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జగన్ రివర్స్ టెండరింగ్ అంటూ కాంట్రాక్టర్ల గుండెల్లో వణుకు పుట్టించాడు. గత ప్రభుత్వాలు ఎక్కువ మొత్తానికి టెండర్లని తమకి నచ్చిన వారికీ అప్పగించాయి అని వైసీపీ అధికారంలోకి రాగానే ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రానికే తలమానికమైన పోలవరం పై రివర్స్ టెండరింగ్ కి వెళ్ళింది. దీని ద్వారా ప్రభుత్వానికి సుమారుగా 628 కోట్ల రూపాయల సొమ్ము ఆదా అయ్యింది.

ఈ రివర్స్ టెండరింగ్ లో పోలవరం ప్రాజెక్ట్ ని మేఘా ఇంజనీరింగ్ సంస్థ 4358 కోట్లకి దక్కించుకుంది. దీనితో నవయుగ సంస్థ దీనిపై హై కోర్ట్ కి వెళ్లి పనులని ప్రారంభించకుండా స్టే విధించేలా చేసింది. కానీ - తాజాగా దీనిపై సమగ్ర విచారణ జరిపిన హై కోర్ట్ ఆ స్టే ని ఎత్తివేస్తూ పనులని ప్రారభించుకోవచ్చు అని తెలిపింది. దీనితో పోలవరం పనులకి నేడు భూమి పూజ చేయాలనీ నిర్ణయం తీసుకున్నారు. అలాగే రేపటి నుండే ( నవంబర్ 2) పనులని కూడా ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది.

కోర్ట్ స్టే ఎత్తేయడంతో నేడు సబ్ కాంట్రాక్టర్లు అవసరమైయ్యే వాహనాలతో పోలవరం దగ్గర భూమి పూజ చేయడానికి బయల్దేరారు. కానీ, పోలవరం వద్దకి యంత్ర సామాగ్రి తో బయల్దేరిన సబ్ కాంట్రాక్టర్లని - గతంలో పోలవరంలో పనిచేసిన సబ్ కాంట్రాక్టర్లు ..లోకల్ లీడర్స్ తో కలిసి అడ్డుకునే ప్రయత్నం చేసారు. దీనితో వెంటనే రంగంలోకి దిన పోలీసులు ఆందోళనకారులని పక్కకు నెట్టి మెగా అధికారులను - యంత్రాలతో కూడిన వాహనాలను ముందుకు పంపారు. అలాగే మధ్యలో మరోసారి ఆందోళనకారులు అడ్డుతగిలే ఆస్కారం ఉండటంతో పోలవరం వరకు అధికారులకి - యంత్ర వాహనాలకు రక్షణగా వెళ్లారు. మరికాసేపట్లోనే మెగా ఇంజనీరింగ్ అధికారులు భూమిపూజ చేసి ప్రాజెక్ట్ పనులు ప్రారంభించబోతున్నారు. పోలవరం పనులని ఆపడానికి ఎదో ఒక బలమైన రాజకీయ పార్టీ ట్రై చేస్తుందని పలువురు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలని తెలియపరుస్తున్నారు.