Begin typing your search above and press return to search.

జ‌ల్లిక‌ట్టుః పెటా...త‌ర్వాతి స్టెప్ అదే

By:  Tupaki Desk   |   20 Jan 2017 12:13 PM GMT
జ‌ల్లిక‌ట్టుః పెటా...త‌ర్వాతి స్టెప్ అదే
X
త‌మిళ‌నాడులో జ‌ల్లిక‌ట్టు నిషేధానికి కార‌ణ‌మైన పెటా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకునేందుకు సిద్ధ‌మ‌వుతోంది. తమిళనాడులో అగ్గి రాజేస్తున్న జల్లికట్టు నిషేధంపై కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువస్తే న్యాయపరంగా పోరాడాలని జంతుపరిరక్షణ సంస్థ పెటా నిర్ణయించింది. ‘మా పోరాటం జంతువులను హింసించటంపైనే. ఒకవేళ ఆర్డినెన్స్ కనుక వస్తే మా న్యాయవాదులను సంప్రదించి నిర్ణయం తీసుకుంటాం’ అని పెటా ప్రతినిధి మనీలాల్ వల్లియత్ తెలిపారు. జల్లికట్టును సమర్థించేవారు తప్పుడు సమాచారంతో తప్పుడు అవగాహనతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. రాజకీయ నాయకులు భారత రాజ్యాంగాన్ని గౌరవించాలని, సుప్రీం కోర్టు తీర్పును పూర్తిగా చదివిన తరువాత ఒక నిర్ణయానికి రావాలని వివరించారు.

ఇదిలాఉండ‌గా...జ‌ల్లిక‌ట్టుపై రెండు రోజుల్లో ఆర్డినెన్స్ జారీ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని త‌మిళ‌నాడు సీఎం ప‌న్నీర్‌ సెల్వం వెల్ల‌డించారు. సాయంత్రం దీనికి సంబంధించిన ముసాయిదా ఆర్డినెన్స్‌ ను రాష్ట్ర‌ప‌తి ప‌రిశీల‌న‌కు పంపనున్నార‌ని ఆయ‌న తెలిపారు. జ‌ల్లిక‌ట్టు ఈవెంట్‌ ను తానే ప్రారంభిస్తాన‌ని, మీ కోరిక త్వ‌ర‌లోనే నెర‌వేర‌బోతోంద‌ని ప‌న్నీర్ స్ప‌ష్టంచేశారు. ఆర్డినెన్స్‌ పై ఇప్ప‌టికే ప‌ని మొద‌లుపెట్టామ‌ని కేంద్ర మంత్రి ర‌విశంకర్ ప్ర‌సాద్ వెల్ల‌డించారు. త‌మిళ ప్ర‌జ‌ల సెంటిమెంట్‌ను కేంద్రం గౌర‌విస్తుంద‌ని చెప్పారు. మ‌రోవైపు జ‌ల్లిక‌ట్టుకు మ‌ద్ద‌తుగా మెరీనాబీచ్‌ లో ఆందోళ‌న‌లు నాలుగో రోజు కూడా ఉద్ధృతంగా సాగుతున్నాయి. తాజాగా త‌మిళ సూప‌ర్‌ స్టార్లు ర‌జ‌నీకాంత్‌ - అజిత్‌ - సూర్య కూడా ఈ ఆందోళ‌న‌ల్లో పాలుపంచుకున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/