Begin typing your search above and press return to search.

హైకోర్టులో సంచలన పిటిషన్..బాబుకు కష్టకాలం

By:  Tupaki Desk   |   14 Jun 2019 8:57 AM GMT
హైకోర్టులో సంచలన పిటిషన్..బాబుకు కష్టకాలం
X
టీడీపీ అధినేత - ఏపీ విపక్ష నేత నారా చంద్రబాబునాయుడు కు ఈ పరిణామం నిజంగానే తీవ్ర ఇబ్బందులను కలగజేసేదిగానే కనిపిస్తోంది. ఎన్నికల ముంగిట దాకా చాలా నిదానంగానే సంక్షేమ పథకాలను అమలు చేసిన చంద్రబాబు... సరిగ్గా ఎన్నికలకు ముందు పలు కొత్త పథకాలకు శ్రీకారం చుట్టేసి... ఆ పథకాల ద్వారా లబ్ధిదారులకు అందే సొమ్ము తన పార్టీకి ఓట్లు రాబడుతుందని చంద్రబాబు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఏమాత్రం దాచుకోకుండా బయటపడిన చంద్రబాబు... విశాఖ కేంద్రంగా తన పార్టీ డబ్బు పంచలేదని - అయితే ప్రభుత్వ పథకాల పేరిట పంచుతున్న సొమ్ముతోనే తన పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆయన సంచలన ప్రకటన చేశారు. ఇప్పుడు ఈ ప్రకటనే ఆయనను ఇబ్బందుల పాలు చేస్తోందన్న వాదన వినిపిస్తోంది

చంద్రబాబు నోట నుంచి నాడు వినిపించిన మాటనే ఆధారం చేసుకుని ఇప్పుడు ఏపీ హైకోర్టులో ఓ ఆసక్తికర పిటిషన్ దాఖలైంది. రిపబ్లిక్ పార్టీ అధికార ప్రతినిధి బోరుగడ్డ అనిల్ కుమార్ ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. ఆ పిటిషన్ లో అనిల్ ఏమని వాదిస్తున్నారంటే... ప్రభుత్వ పథకాల పేరుతో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు ప్రభుత్వ సొమ్మును వాడుకున్నారట. ఎన్నికల ముంగిట ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేలా ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలకు ఇప్పటిదాకా ఖర్చు చేసిన మొత్తాన్ని చంద్రబాబు సొంత ఖర్చుల కింద జమ చేయాలని అనిల్ వాదిస్తున్నారు. అంటే... ఎన్నికల ముంగిట చంద్రబాబు సర్కారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఖర్చు చేసిన మొత్తాన్ని చంద్రబాబు నుంచి రాబట్టాలని అనిల్ డిమాండ్ చేస్తున్నారన్న మాట.

ఇటు చంద్రబాబుతో పాటు మొత్తంగా టీడీపీని పెద్ద చిక్కుల్లోనే పడేసేలా కనిపిస్తున్న ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించేసింది. సోమవారం దీనిపై విచారణ చేపట్టనున్నట్లు హైకోర్టు రిజిస్ట్రీ నెంబరు కూడా కేటాయించింది. మరి ఈ పిటిషన్ విచారణలో అనిల్ తన వాదనను ఎంత బలంగా వినిపిస్తారో - ఆ వాదనను విన్న హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనన్న ఆసక్తి రేకెత్తించింది. ఒకవేళ అనిల్ వాదన సరైనదేనని హైకోర్టు తీర్పు చెబితే మాత్రం చంద్రబాబుకు బ్య ాండ్ పడిానట్టేనన్న వాదన వినిపిస్తోంది. విచారణ సంగతిని అలా పక్కనపెడితే... హైకోర్టు ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరిస్తున్నట్లుగా చెప్పడంతోనే టీడీపీలో అలజడి మొదలైపోయింది.