Begin typing your search above and press return to search.
సుప్రీంలో తాజా పిటిషేన్ సరే.. ఇంతకాలం ఏం చేసినట్లు?
By: Tupaki Desk | 15 Dec 2022 3:52 AM GMTఉమ్మడిగా ఉన్న తెలుగు రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోయి దాదాపు ఎనిమిదిన్నరేళ్లు కావొస్తున్న పరిస్థితి. రాష్ట్ర విభజన చాలా సింఫుల్ ప్రక్రియ. మహా అయితే 48 గంటల్లో అన్నీ అయిపోతాయి. పంచాయితీ ఉండదు.
ఈ మాత్రం దానికి కేంద్రం ఇంతమంది అమాయకుల బలిదానాల్ని తీసుకుంటుందంటూ గుక్క తిప్పుకోకుండా మాట్లాడే కేసీఆర్ కానీ ఆయన్ను ఫాలో అయ్యే వారు కానీ.. నిపుణులు.. మేధావులు కానీ అదంతా అబద్ధం.. నిజం కాదన్న మాటను చెప్పింది లేదు. విభజన జరిగి ఎనిమిదేళ్లు అవుతున్నా.. ఈ రోజుకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తెగని పంచాయితీలు ఎన్నో.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. మూడున్నరేళ్లుగా అధికారంలో ఉన్న జగన్ సర్కారు.. ఇప్పుడు సిత్రమైన వాదనను తెర మీదకు తీసుకొచ్చి సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
నిజానికి ఇప్పుడు ప్రస్తావించిన అంశం విభజన నాటి నుంచి ఉన్నా.. అధికారంలోకి వచ్చిన ఇంతకాలానికి గుర్తుకు రావటం ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇంతకీ జగన్ సర్కారు లేవనెత్తిన అంశాల్ని చూస్తే.. వ్యూహాత్మకంగానే పిటిషన్ దాఖలు చేసినట్లుగా కనిపిస్తోంది.
ఇక.. సుప్రీంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ లోని కీలక అంశాల్ని చూస్తే..
- రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తులు.. అప్పుల్ని వేగంగా విభజించాలి
- రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21 లలో పొందుపరిచిన హక్కులతో పాటు విభజన అనంతరం దక్కించుకోవాల్సిన ప్రయోజనాల్ని దక్కించుకోవాల్సిన అవసరం ఉంది.
- రాష్ట్రం విడిపోయి ఎనిమిదేళ్లు అవుతున్నా.. ఇప్పటివరకు ఆస్తుల విభజన ప్రారంభం కాలేదు.
- షెడ్యూల్ 9లో పేర్కొన్న 91 సంస్థలు.. షెడ్యూల్ 10లో పేర్కొన్న 142 సంస్థల్లోని ఏ ఒక్కదాన్ని రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయలేదు.
- ఈ నాన్చివేత కారణంగా తెలంగాణకు మేలు కలుగుతుంది.
- ఈ మొత్తం సంస్థల ఆస్తుల విలువ రూ.1,42,601 కోట్లు ఉంటుంది.
- ఆస్తుల్లో అత్యధికం ఒకప్పటి సమైక్య రాష్ట్ర రాజధాని.. ప్రస్తుత తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్ లోనే ఉంది.
- హైదరాబాద్ ఆర్థిక పవర్ హౌజ్ గా మారింది.
- షెడ్యూల్ 9లో పేర్కొన్న సంస్థల ప్రధాన కార్యాలయాల విలువ దాదాపు రూ.24,018 కోట్లుగా ఉంటుంది. వీటిల్లో రూ.22,556 కోట్ల విలువైన ఆస్తులు తెలంగాణలోనే ఉన్నాయి.
- షెడ్యూల్ 10లో పేర్కొన్న ఆస్తులు రూ.34,642 కోట్లు ఉంటే.. అందులో రూ.30,530 కోట్ల ఆస్తులు తెలంగాణలోనే ఉన్నాయి.
- వీటి విభజన జరగని కారణంగా ఏపీ ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లేలా చేస్తోంది.
- ఆస్తుల విభజనకు వేగంగా చర్యలు తీసుకోవాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.