Begin typing your search above and press return to search.
ఏపీలో ఎన్నికలు వాయిదా వేయండి..కోర్టులో పిటిషన్!
By: Tupaki Desk | 22 March 2019 5:56 AM GMTమొదటి దశలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న ప్రాంతం అంతా పోలింగ్ ను వాయిదా వేయాలని కోరుతూ ఏపీ హై కోర్టులో ఒక పిటిషన్ దాఖలు అయ్యింది. వచ్చే నెల పదకొండో తేదీన తొలి విడత ఎన్నికల పోలింగ్ జరబోతున్న సంగతి తెలిసిందే. ఆ తొలి విడతలోనే తొలి రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ పూర్తి కానుంది. పదకొండో తేదీన.. ఏపీ - తెలంగాణ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఈ నేపథ్యంలో.. ఆ రోజున పోలింగ్ జరగడానికి వీల్లేదన ఒక పిటిషనర్ కోర్టును కోరారు. ఇంతకీ ఎందుకు అంటే.. ఆ రోజున మహాత్మ జ్యోతి బాపూలే జయంతి అని - ఆ రోజు ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తాయి కాబట్టి.. ఆ రోజున పోలింగ్ జరగడానికి వీల్లేదనేది లాజిక్.
తెలానికి చెందిన సామాజిక కార్యకర్త ఒకరు ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. ఏపీ హై కోర్టులో ప్రజా ప్రయోజనా వ్యాజ్యంగా దీన్ని దాఖలు చేశారు. దీన్ని విచారణ జరగాల్సి ఉంది.
పూలే జయంతి అధికారికంగా నిర్వహించే కార్యక్రమమే కానీ.. ఆ కార్యక్రమం నిర్వహించడం కోసమని ఇంత వరకూ వచ్చాకా పోలింగ్ ను వాయిదా వేయాలని అనడం సమంజసమేనా.. అనే అంశంపై కోర్టు తేల్చాలి. ఇప్పటికే రాజకీయ పార్టీలు ప్రచార హోరుతో ముందుకు వెళ్లాయి.
ఇలాంటి నేపథ్యంలో ఈ పిటిషన్ ను విచారించి - పోలింగ్ విషయంలో కోర్టు ఏం చెబుతుందనేది అత్యంత ఆసక్తిదాయకమైన అంశం. ఇందులో కేంద్ర ఎన్నికల కమిషన్ కు కూడా కోర్టు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.