Begin typing your search above and press return to search.
ఓటుకు నోటు కేసు లో కదలిక .. సుప్రీం మెట్లెక్కిన ఆర్కే !
By: Tupaki Desk | 25 Nov 2019 11:33 AM GMTతెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కేసుల్లో ఒకటి ఓటుకు నోటు. అప్పట్లో ఈ కేసు సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కాదు. ఈ కేసులో మాజీ సీఎం చంద్రబాబు జైలుకి వెళ్లడం కూడా లాంఛనమే అనుకున్నారు. కానీ , ఆ తరువాత అనూహ్యంగా ఈ కేసు మరుగున పడిపోయింది. దీనితో ఈ కేసు నుండి చంద్రబాబు బయట పడ్డట్టే అనుకున్నారు. కానీ , తాజాగా మరోసారి ఓటుకు నోటు కేసు తెర పైకి వచ్చింది.
ఈ కేసు పై ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఒకసారి సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. కానీ , అది సుప్రీంకోర్టులో లిస్టింగ్ కాలేదు. దీనితో మరోసారి సుప్రీంకోర్టులో ఎర్లీ హియరింగ్ పిటిషన్‌ను వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే దాఖలు చేశారు. ఈ పిటిషన్ లో ప్రస్తుతం ట్రయల్ కోర్టులో కేవలం ఏ1 నుంచి ఏ5 వరకు మాత్రమే విచారణ జరుపుతున్నారని, చంద్రబాబు మీద విచారణ జరపడం లేదని ఆయన పొందుపరిచారు. చంద్రబాబు మీద కూడా విచారణ జరిపించాలని, ఈ కేసును సీబీఐకి ఇవ్వాలని పిటిషన్ లో కోరారు.
2015 లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తమ పార్టీ అభ్యర్థికి మద్దతివ్వాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ కి అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యే గా ఉన్న రేవంత్ రెడ్డి రూ.50 లక్షలు అడ్వాన్స్ ఇస్తున్న వీడియో సంచలనం సృష్టించింది. ఈ కేసు టీడీపీ అధినేత ను ఇరుకున పెట్టేసింది. మనవాళ్లు బ్రీఫ్ డీ మీ అంటూ చంద్రబాబు చెప్పిన ఆడియో అప్పట్లో పెద్ద దుమారం రేపింది. అయితే, తన ఫోన్‌ను టాప్ చేశారంటూ చంద్రబాబు కేసీఆర్ ప్రభుత్వం పై విరుచుకు పడ్డారు. ఆ తరువాత చంద్రబాబు రాజధానిని హైదరాబాద్ నుండి అమరావతి కి పూర్తిగా షిఫ్ట్ చేసారు.