Begin typing your search above and press return to search.
హైకోర్టులో పిటిషన్.. రూ.50వేలు ఫైన్ వేసి షాకిచ్చిన ధర్మాసనం
By: Tupaki Desk | 29 Aug 2020 11:30 AM GMTప్రజా ప్రయోజనం కోసం వేయాల్సిన పిటిషన్ ను అందుకు భిన్నంగా స్వార్థంతో.. దురుద్దేశంతో వేసిన పిటిషన్ కు ఘాటైన సమాధానం ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. తాజాగా తమ ముందుకు వచ్చిన ఒక పిటిషన్ విచారణ సందర్భంగా పిటిషన్ దారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు ఫైన్ విధించింది. రెండువారాల్లో ఆ మొత్తాన్ని చెల్లించని పక్షంలో కోర్టు ధిక్కార నేరాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇంతకీ హైకోర్టు ఎందుకంత ఆగ్రహాన్ని వ్యక్తం చేసిందన్న విషయంలోకి వెళితే..
నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ డ్యామ్ కు సమీపంలో కొత్తగా పెట్రోల్ పంపు ఏర్పాటు చేస్తున్నారు. దీని కారణంగా డ్యామ్ కు ఇబ్బంది అవుతుందంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని వేశారు జిల్లాకు చెందిన బీఏ వెంకటేశ్వర్లు. దీనిపై ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని కోరింది. అయితే.. కొత్తగా ఏర్పాటు చేసే పెట్రోల్ బంక్.. డ్యాం పరిధిలోకి రాదని పేర్కొనటంతో పాటు.. పిటిషన్ దారు మరో పెట్రోల్ బంకులో పని చేస్తున్నారని.. పిటిషన్ వెనుక వేరే వారు ఉన్నట్లుగా స్పష్టం చేసింది.
దీంతో ఆగ్రహాం వ్యక్తం చేసిన హైకోర్టు.. పిల్ దాఖలు చేసిన తీరులో దురుద్దేశాలు ఉన్నాయని పేర్కొంటూ రూ.50వేలు ఫైన్ చెల్లించాలని పేర్కొంది. ఆ మొత్తాన్ని న్యాయవాదుల సంక్షేమ నిధికి రెండు వారాల్లో చెల్లించాలని స్పష్టం చేసింది. అనవసరమైన పిటిషన్లతో కోర్టు విలువైన కాలాన్ని వేస్ట్ చేయాలని చూసే వారికి ఈ నిర్ణయం ఒక పాఠంగా మారుతుందని చెబుతున్నారు.