Begin typing your search above and press return to search.
ఆనందయ్య మందుపై హైకోర్టుకు.. విచారణకు ఓకే
By: Tupaki Desk | 25 May 2021 5:30 PM GMTఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనా ఆయుర్వేద మందుతో ఫేమస్ అయిన ఆనందయ్య మందు ఇప్పుడు దేశవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తోంది. ఈ మందును ఏపీ ప్రభుత్వం నిలుపుదల చేయించి ప్రస్తుతం దీనిపై పరిశోధన చేస్తోంది. కేంద్ర ఐసీఎంఆర్, ఆయూష్ శాఖలు పరిశీలిస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఏపీలో ఈ ఆయుర్వేద మందు పంపిణీకి బ్రేక్ వేయడం తగదంటూ హైకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. వీటిని హైకోర్టు విచారణకు స్వీకరించడం విశేషం.
దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం రేపుతున్న ఈ నేపథ్యంలో ఏ మందులు పనిచేయడం లేదు. జనాలు పిట్టల్లా రాలుతున్నారు. వ్యాక్సిన్లు అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో ఎలాంటి అనర్థాలు లేవని ఆయూష్ శాఖ తెలిపిన ఈ మందును వెంటనే అనుమతించాలని పిటీషనర్లు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆనందయ్య మందు పంపిణీని అడ్డుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో రెండు పిటీషన్లు దాఖలయ్యాయి.
ఆనందయ్య పంపిణీ కోరుతూ దాఖలైన రెండు పిటీషన్లను హైకోర్టు విచారణకు స్వీకరించింది. వీటిపై ఈనెల 27న విచారణ చేపట్టనున్నట్లు హైకోర్టు ప్రకటించింది. ఈ మందు ఖర్చును ప్రభుత్వమే భరించాలని పిటీషనర్లు కోరారు. మందు పంపిణీకి శాంతి భద్రతల సమస్యలు రాకుండా చూడాలని సూచించారు. లోకాయుక్త ఆనందయ్య మందు పంపిణీని నిలిపివేసే అధికారమే లేదని హైకోర్టు దృష్టికి పిటీషన్లు తీసుకొచ్చారు. దీనిపై విచారణకు హైకోర్టు స్వీకరించింది.