Begin typing your search above and press return to search.
మే 15 తర్వాత ఏపీలో వాహనదారులకు షాకే
By: Tupaki Desk | 26 April 2017 5:36 AM GMTదీర్ఘకాలంగా తమ సమస్యలకు పరిష్కారం ఇవ్వని ప్రభుత్వాలకు షాకిచ్చేందుకు సిద్దమయ్యాయి ఏపీ పెట్రోల్ బంకుల యాజమాన్యాలు. ప్రభుత్వ తీరుపై విసిగిన వారు.. ప్రజలకు షాకివ్వటం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడిని పెంచే కార్యక్రమానికి షురూ పలికారు. గడిచిన ఏడాది ముంబయిలోని చమురు కంపెనీల ఉన్నతాధికారుల సమక్షంలో ఇచ్చిన పదకొండు హామీల అమల్లో జరుగుతున్న ఫెయిల్యూర్ పై పెట్రోల్ బంకు యజమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే.
డీలర్ మార్జిన్ పెంచే విషయంలో ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్న కంపెనీ తీరు.. ప్రభుత్వ విధానాలపై విసిగిపోయిన వ్యాపారులు.. తమదైన శైలిలో ఒత్తిడి పెంచేందుకురంగం సిద్ధం చేవారు. ఇందులో భాగంగా తాజా కార్యాచరణను ప్రకటించారు. మే 15 తర్వాత నుంచి ఏపీలోని పెట్రోల్ బంకులు సరికొత్త విధానాన్ని అనుసరించనున్నట్లుగా వెల్లడించారు.
తమ సమస్యల పరిష్కారంపై స్పందించని ప్రభుత్వానికి ఝులక్ ఇచ్చే ప్రయత్నంలో ఏపీ ప్రజలకుదిమ్మ తిరిగేలా షాక్ ఇవ్వాలని డిసైడ్ కావటం గమనార్హం. మే 14 నుంచి ప్రతి ఆదివారం పెట్రోల్ బంకుల్ని విధిగా మూసేస్తామని.. ప్రతి రోజు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ మాత్రమే పెట్రోల్ బంకులు పని చేస్తాయని చెబుతున్నారు. ఒకవేళ అదే జరిగితే మాత్రం.. వాహనదారులకు చుక్కలు కనిపించటం ఖాయం. సమస్య మరింత ముదిరి.. తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగే వరకూ మురగబెట్టే అలవాటున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఈ ఇష్యూ మీద కల్పించుకొని ఒక సొల్యూషన్ వెతికితే మంచిదన్న సూచన పలువురు చేస్తున్నారు. మరి.. చంద్రబాబు ఈ అంశంపై రియాక్ట్ అవుతారా?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/