Begin typing your search above and press return to search.
ఈ ముఖ్యమంత్రికి వచ్చిన బాదుడు ఐడియా తెలుగు సీఎంలకు రావొద్దు
By: Tupaki Desk | 16 Jun 2020 4:30 AM GMTప్రపంచం మొత్తం ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న వేళ.. వాళ్లు..వీళ్లు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు మాయదారి రోగానికి ప్రభావితమైన వారే. ఆదాయం పూర్తిగా కోల్పోయినోళ్లు కొందరుంటే.. ఉద్యోగాలు పోగొట్టుకున్న వారు పలువురు ఉన్నారు. ఎలాంటి సమస్యా లేకుండా.. నష్టం లేని వారు చాలా చాలా అరుదుగా చెప్పక తప్పదు. వ్యక్తులకు మాత్రమే కాదు.. వ్యవస్థలకు సైతం పెను సవాలు విసురుతోంది మహమ్మారి. కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ మార్గాల్లో వచ్చే ఆదాయాలు భారీగా పడిపోయిన నేపథ్యంలో.. ఉన్న ఒకే ఒక్క ఆదాయ వనరు పెట్రోల్.. డీజిల్ అమ్మకాలు.
ఈ విషయాన్ని గుర్తించిన కేంద్రంలోని మోడీ సర్కారు ఇటీవల కాలంలో పెట్రోల్.. డీజిల్ ధరల్నివరుస పెట్టి పెంచేస్తోంది. రోజువారీగా పెంచుతున్న ధరలతో సామాన్యులు బెంబెలెత్తిపోతున్నారు. ఇదిలా ఉంటే.. కేంద్రానికి మించిన రీతిలో గుజరాత్ ప్రభుత్వం అనూహ్య నిర్ణయాన్ని వెల్లడించింది. రాష్ట్రానికి ఆదాయం బాగా పడిపోయిన నేపథ్యంలో పెట్రోల్.. డీజిల్ అమ్మకాలపై లీటరుకు రూ.2 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
గడిచిన ఎనిమిది రోజులుగా అంతకంతకూ పెరుగుతున్న ధరలకు ఈ రెండు రూపాయిలు అదనం కావటం గమనార్హం. తాజాగా పెంచిన ధరలు సోమవారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని గుజరాత్ సర్కారు ప్రకటించింది. దీంతో గుజరాత్ వ్యాప్తంగా లీటరు పెట్రోల్ రూ.73.99 కాగా.. డీజిల్ ధర లీటరు రూ.72.12గా మారింది.
లాక్ డౌన్ నేపథ్యంలో తగ్గిన ప్రభుత్వ ఆదాయాన్ని పూడ్చుకునేందుకు ధరల్ని పెంచేస్తున్న వైనం చూస్తే.. కేంద్రం.. గుజరాత్ రాష్ట్ర సర్కారు ఒకే రీతిలో ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తోంది. లక్కీగా.. ఇలాంటి ఆలోచనలు ఇప్పటివరకూ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాలేదు. గుజరాత్ సర్కారు బాదుడు వ్యవహారం వీలైనంత వరకూ వారికి తెలీకుంటే బాగుండు.