Begin typing your search above and press return to search.
అక్కడ అంత తగ్గితే..మోడీ తగ్గించింది మాత్రం..
By: Tupaki Desk | 1 April 2017 4:59 AM GMTసార్వత్రిక ఎన్నికలకు కాస్త ముందుగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పదే పదే అందరి కంటా పడేది. అదేమంటే.. భారత ప్రదానిగా నరేంద్ర మోడీ కానీ అయితే పరిస్థితులు మొత్తం మారిపోతాయని.. రూపాయి మారకం విలువ పెరిగిపోతుందని.. డాలర్ తో పోలిస్తే పిచ్చ స్ట్రాంగ్ కావటం ఖాయమని బోడన్ని కబుర్లు వినిపించేవి. అంతేనా.. పెట్రోల్.. డీజిల్ ధరలు దారుణంగా ఉన్నాయని.. మోడీ ప్రధాని సీట్లో కూర్చున్నాక.. వాటి ధరలు తగ్గిపోతాయంటూ చాలానే లెక్కలు చూపించేవారు. పక్కనున్న దేశాల్లో పెట్రోల్..డీజిల్ ధరలు ఎంత తక్కువగా ఉన్నాయో లెక్కలు వివరిస్తూ.. ఆ దిశగా తీసుకెళ్లగలిగే సత్తా మోడీకి మాత్రమే ఉందన్న మాటను చెప్పేవారు.
సోషల్ మీడియాలో కోరుకున్నట్లే.. ప్రధానమంత్రిగా మోడీ బాధ్యతలు తీసుకున్నారు. అది జరిగీ అటూఇటూగా మూడేళ్లు అయిపోయాయి. మరి..నాటి పోస్టింగుల్లో చెప్పినట్లే పెట్రోల్.. డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టాయా? అంటే లేదని చెప్పాలి. ఎందుకిలా? ప్రపంచ మార్కెట్లో ముడిచమురు మండిపోతుందా?అందుకే.. మోడీ ఏం చేయలేకపోయారా? అన్న ప్రశ్నించుకుంటే.. అలాంటిదేమీ లేదన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. మరి.. ప్రపంచ మార్కెట్లో ధరలు తక్కువగా ఉన్నప్పుడు.. పెట్రోల్.. డీజిల్ ధరలు ఎందుకు తగ్గలేదు? అన్నది చూసినప్పుడు తగ్గిన ఫలాల్ని ప్రజలకు అందించాలన్న ధ్యాస మోడీకి లేకపోవటమేనని చెప్పక తప్పదు.
గడిచిన కొన్ని నెలలుగా ధరలు అంతకంతకూ పెరగటమే కానీ.. తగ్గింది లేదు. ముడిచమురు ధరలు అంతర్జాతీయ విపణిలో తగ్గినా.. రూపాయి మారకం విలువ పడిపోవటంతో ధరలు అనుకున్నరీతిలో తగ్గలేదన్న మాటలు వినిపిస్తుంటాయి. అదే నిజమని నమ్మినా.. అంతలోనే కొన్ని విషయాలు గుర్తుకు వస్తాయి. అంతర్జాతీయ ముడిచమురు ధరలు భారీగా తగ్గిన వేళలో.. గతంలో ఉన్న లోటును భర్తీ చేసుకోవటానికి కొన్నాళ్లు.. తగ్గిన ఫలాల్ని దేశ ప్రజలకు అందకుండా పరోక్ష పద్ధతిలోని పన్నుల సర్దుబాటు లాంటి వాటితో.. ఏ రోజూ తగ్గిన ఫలాలు ప్రజలకు పూర్తిగా అందలేదని చెప్పక తప్పదు.
ధరలు పెంచాల్సి వస్తే.. మొహమాటం లేకుండా లీటరుకు మూడు నాలుగు రూపాయిలు పెంచేసే మోడీ సర్కారు.. తగ్గించే విషయానికి వస్తే మాత్రం పినాసితనంతో వ్యవహరించటం చూస్తున్నదే. ఎప్పటిదాకానో ఎందుకు తాజాగా ముడిచమురు ధరలు భారీగా తగ్గి..బ్యారెల్ యాభైడాలర్ల కంటే దిగువనకు రాగా.. లీటరు మీద పెట్రోల్ తగ్గించింది మాత్రం కేవలం రూ.3.77 మాత్రమే. ఇక..డీజిల్ విషయంలో లీటర్ కు తగ్గింది రూ.2.91 మాత్రమే. అంతర్జాతీయ మార్కెట్లో నాలుగు నెలల కనిష్ఠానికి ముడిచమురు ధరలు తగ్గగా.. లీటరు పెట్రోల్.. డీజిల్ మీద ఎంత తగ్గాయన్నది చూస్తే.. తగ్గిన ఫలాలు ప్రజలకు అందలేదన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.
యూపీఏ హయాంలో బ్యారెల్ ముడి చమురు ధర 100 డాలర్లు దాటితే.. పెట్రోల్ ధర గరిష్ఠంగా రూ.80 కుటచ్ అయ్యింది.కానీ.. ఇప్పుడు యాభై డాలర్ల కంటే తక్కువకే దరలు న్నా.. లీటర్ పెట్రోల్ ధర తాజాగా తగ్గించిన ధరలతో లెక్క వేస్తే.. రూ.73 వరకూ (పైసల్లో కాసింత తేడా ఉండొచ్చు) ఉంది. అంటే బ్యారెల్ ముడిచమురు ధర యాభై ఐదు డాలర్లు తగ్గినా.. పెట్రోల్ ధర విషయంలో సామాన్యుడికి కలిగిన లాభం కేవలం లీటరుకు రూ.7 మాత్రమే అంటే..మోడీ జమానాలో సగటుజీవి బతుకు ఎంత ఖరీదైందన్న విషయం అర్థం కాక మానదు. భారీ అవినీతి.. అంతర్జాతీయంగా ధరలు మండే వేళలో లీటరు పెట్రోల్ రూ.80 ఉంటే.. అవినీతి అన్నది లేని మోడీ సర్కారు హయాంలో.. అంతర్జాతీయ ముడిచమురు బ్యారెల్ యాభై డాలర్ల కంటే తక్కువ ఉన్న వేళ లీటరు పెట్రోల్ రూ.73 ఎందుకు ఉన్నట్లు? ఎందుకు సామాన్యుడి మీద ఇంత భారం మోపుతున్నట్లు..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/