Begin typing your search above and press return to search.

కేంద్రమంత్రిని ఇలా అడిగి ఉంటే బాగుండేది

By:  Tupaki Desk   |   10 May 2016 8:20 AM GMT
కేంద్రమంత్రిని ఇలా అడిగి ఉంటే బాగుండేది
X
మీకిప్పుడు మేం ఎలాంటి వివరాలు చెప్పట్లేదు. సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. అదేమంటే.. 2013 నుంచి ఇప్పటివరకూ పెట్రోల్ ధరల్ని ఎక్కువ సార్లు తగ్గాయా? ఎక్కువసార్లు పెరిగాయా? ఈ ప్రశ్నను ఎవరిని అడిగినా.. అత్యధికుల నోటి నుంచి వచ్చే సమాధానం.. ఎక్కువసార్లు పెంచారనే. కానీ.. అధికారిక లెక్కల ప్రకారం అందుకు భిన్నమైన సమాదానం వస్తోంది. పెట్రోల్ ధరల్ని ఎక్కువసార్లు తగ్గించారని.. పెంచింది తక్కువసార్లు అన్న విషయం తాజాగా బయటకు వచ్చింది. ఈ ఆశ్చర్యకరమైన విషయాన్ని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

ప్రశ్నోత్తరాల సమయంలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు స్పందించిన ఆమె.. పెట్రోల్.. డీజిల్ ధరల విషయానికి సంబంధించిన వివరాల్ని ఆమె చెప్పుకొచ్చారు. దాని ప్రకారం.. 2013 ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకూ పెట్రోల్ ధర 21 పెరిగితే.. 32 సార్లు తగ్గింది. అదే సమయంలో డీజిల్ విషయంలో మాత్రం లెక్క కాస్త తేడా ఉంది. డీజిల్ ధరను ఎక్కువ సార్లు పెంచటమే జరిగింది. డీజిల్ ధర 28 సార్లు పెరితే.. 19 సార్లు మాత్రమే తగ్గించారు. భారత్ లో పెట్రోల్.. డీజిల్ రిటైల్ ధర అంతర్జాతీయ రేట్ల మీద ఆధారపడినట్లుగా మంత్రి చెప్పుకొచ్చారు.

నిజానికి మంత్రిగారిని ప్రశ్న అడిగే విషయంలో తప్పు చేశారనే చెప్పాలి. ఎన్నిసార్లు పెంచారు.. ఎన్నిసార్లు తగ్గించారన్న ప్రశ్న మాత్రమే కాదు.. తగ్గించినప్పుడు ఎంత చొప్పున (సరాసరి) తగ్గించారు? పెంచినప్పుడు ఎంత చొప్పున (సరాసరి) పెంచారన్న క్వశ్చన్ కానీ అడిగి ఉంటే.. జనాల మద బాదుడు ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమయ్యేది.