Begin typing your search above and press return to search.

బ్యారెల్ 50 డాలర్లతో మరోసారి తగ్గింపు

By:  Tupaki Desk   |   15 Aug 2015 3:50 AM GMT
బ్యారెల్ 50 డాలర్లతో మరోసారి తగ్గింపు
X
కేంద్ర సర్కారు అనుసరిస్తున్న విధానాల కారణంగా.. ప్రతి నెల 15వ తేదీన.. నెలాఖరున అంతర్జతీయంగా ఉన్న ముడిచమురు ధరల ఆదారంగా ధరల్ని సర్దుబాటు చేయటం తెలిసిందే. తాజాగా అంతర్జాతీయంగా ముడిచమురు ధరల నేపథ్యంలో పెట్రోల్.. డీజిల్ ధరల తగ్గింపు దిశగా నిర్ణయం తీసుకుంది. తాజా తగ్గింపుతో పెట్రోల్ లీటర్ కు రూ.1.27.. డీజిల్ లీటర్ కు రూ.1.17 చొప్పున తగ్గింది.

అంతర్జాతీయంగా బ్యారెల్ పెట్రోల్ ధర 50 డాలర్లకు నిలవటంతో ఈ తగ్గింపు సాధ్యమైంది. తాజాగా తగ్గించిన తగ్గింపు కారణంగా హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర రూ.68.32గా.. డీజిల్ లీటరు ధర రూ.48.99 తగ్గింది. నిజానికి డాలరుతో రూపాయి మారక విలువ తగ్గటంతో ధరల తగ్గింపు తక్కువగా ఉంది. లేకుంటే మరింత భారీగా తగ్గింపు ఉండాల్సిందన్న భావన ఉంది.

దీనికి తోడు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు విధిస్తూ స్థానిక పన్నుల పుణ్యమా అని లీటర్ కు రూ.15 వరకే వ్యత్యాసం ఉంది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో పెట్రో ఉత్పత్తుల మీద విధించే స్థానిక పన్నులు తక్కువగా ఉండటం కారణంగా.. చాలా తక్కువగా ఉంటోంది. దేశంలో అత్యధికంగా పన్నుల వడ్డింపు ఉన్న రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఉండటం గమనార్హం.