Begin typing your search above and press return to search.

పెట్రోల్ ధరలు.. 110 నుంచి 150 వరకు

By:  Tupaki Desk   |   25 Oct 2021 10:30 AM GMT
పెట్రోల్ ధరలు.. 110 నుంచి 150 వరకు
X
పెట్రో రేట్లు పట్టపగ్గాలు లేకుండా పెరుగుతున్నాయి. అడిగే నాథులే లేకుండా పోవడంతో ‘తగ్గేదే లే’ అన్నట్టుగా పెరుగుకుంటూ పోతోంది. దేశంలో పెట్రో రేటు సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. రోజుకు కొంత పెరుగుతూ ఇప్పటి వరకు 110 రూపాయలకు చేరింది. సంవత్సరాలు గడిచినా పదో, ఇరవై రూపాయలో పెరిగిన రోజులుండగా.. ఈసారి ఒకే ఏడాదిలో గనణీయంగా పెరిగింది. సామాన్యుడి నిత్యావసరం అయిన పెట్రోల్ ధరల పెరుగుదలతో దేశవ్యాప్తంగా అన్ని రేట్లు పెరిగి ప్రజల్లో నిరసన వ్యక్తమవుతోంది. ఏడాదిలో ఏకంగా రూ. 36 పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒకే సంవత్సరంలో రూ. 36 పెరగడంతో పాటు ఇంకా ఈ ధరలు నిలుపుదల కాలేదు. ఇప్పటికీ పెరుగుతూనే ఉన్నాయి. అయితే పెట్రోల్ ధరలు అంతర్జాతీయ సమస్య అని ఆ ధరలను ఎవరూ నియంత్రించలేరని కేంద్ర ప్రభుత్వం అంటోంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువ పన్ను విధించడంతోనే పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని కేంద్రం అంటోంది.

ఏడాదిన్నర కిందట పార్లమెంట్ సమావేశాల ముగింపు సందర్భంగా లోక్ సభ నిరవధిక వాయిదా వేస్తూ పెట్రోల్ సర్ చార్జి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ సర్ చార్జికి అనుగుణంగా ప్రత్యేక చట్టాన్ని రూపొందించింది. అప్పటి వరకు పెట్రో ఉత్పత్తులపై విధించడానికి ఉన్న సర్ ఛార్జీలనకు ఉన్ని పరిమితిని మోడీ సర్కార్ ఎత్తివేసింది. దీంతో ట్యాక్స్ రూంలో, సర్ ఛార్జీలు ధరను పెంచుకుంటూ పోయే అవకాశాన్ని కల్పించింది. అంతేకాకుండా ఇందులో రాష్ట్రాలకు వాటాలను ఇవ్వనక్కర్లేదు,పెరిగిన ధరలంతా కేంద్రం ఖాతాల్లోకే వెళ్లే విధంగా మార్గం రచించింది.

కొందరు రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులు పెట్రోల్ ధరల మాటెత్తితే రాష్ట్రాలు పన్ను తగ్గించొచ్చగా.. అంటున్నారు. కానీ సర్ ఛార్జీలు, ఇతర మార్గాల ద్వారా రాష్ట్రాలకు వచ్చే వాటా పెద్దగా ఏమీ ఉండదు. అంతా కేంద్రంమే తీసుకుంటుందని కొందరు విశ్లేషకులు అంటున్నారు. గత ప్రభుత్వం చేసిన పాపమే పెట్రోల్ ధరలకు కారణమని ఇప్పటి ప్రభుత్వం ప్రచారం చేస్తుండగా.. ఆ వివరాలేంటో బయటపెట్టాలని కొందరు అంటున్నారు. ఇవన్నీ సాకులు చెప్పి తప్పించుకోవడం తప్పా పెట్రో ధరల తగ్గింపు ఆలోచన చేయడం లేదని ప్రతిపక్షాలు అంటున్నాయి.

ఇక ఇలా పెట్రెల్ పెరుగుతూ పొతూ చివరికి లీటర్ పెట్రోల్ రూ. 150 అవుతుందని అంటున్నారు. కాంగ్రెస్ హయాంలో లీటర్ రూ. 60 రూపాయలకు గరిష్టంగా అమ్మిన పెట్రోల్ ను ఆరేళ్లలోనే రెట్టింపు ధరకు తెచ్చేశారు. అయితే అభివృద్ధి అంటే ఇదేనా..? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇలా పెట్రోల్ పెంచుకుంటూ పోతే అభివృద్ధి చెందేది పెట్రోల్ నిర్వాహకులు మాత్రమేనని, సామాన్యుల కాదని అంటున్నారు.

ఇప్పటికే చాలా మంది పెట్రోల్ ధరల పెరుగుదలపై ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొందరు వాహనాలను పక్కన బెట్టి ఇతర మార్గాలను చూసుకుంటున్నారు. ప్రజల నిరసనను పట్టించుకోకుండా కేంద్రం మాత్రం పెట్రోల్ ధరలను రోజురోజుకు పెంచుకుంటూ పోతుంది. కారణాలు చెప్పకుండా దాటవేస్తోంది. అంతర్జాతీయ పరిస్థితులతోనే పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయంటే మోడీ దేశ ప్రజల కోసం ఏం చేయలేడా..? అని కొందరు అంటున్నారు. పెట్రోల్ ధరల కారణంగా నిత్యావసర ధరలు పెరుగుతన్నాయి. దీంతో సామాన్యులు నిత్యావసర వస్తువులు కొనలేని పరిస్థితి నెలకొంది.

పెట్రోల్ ధరలపై ప్రతిపక్షాలు ఎంత పోరాడుతున్నాకేంద్రం మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు. మరోవైపు కొందరు బీజేపీ నాయకులు పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉంటాయి.. ప్రత్యామ్నాయం చూసుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలపై ప్రజలు తిరగబడుతున్నా నాయకులు మాత్రం పెట్రోల్ ధరల తగ్గింపుపై ఎలాంటి ఆలోచనలు చేయడం లేదని అంటున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం అంతర్జాతీయ కహనీలు చెప్పడమే కానీ ధరల తగ్గింపు చర్యలేమీ తీసుకోవడం లేదని అంటున్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఏనాడే లేనంత కనిష్ట స్థాయికి పడిపోయినప్పుడే ధరలు తగ్గాలని భావిస్తే ఆరోజు ఎప్పటికి వస్తుందో చూడాలని అంటున్నారు.