Begin typing your search above and press return to search.
పడిపోయింది అంత అయితే తగ్గింది ఇంతే..?
By: Tupaki Desk | 1 Aug 2015 4:52 AM GMTఅంతర్జాతీయ ధరలకు అనుగుణంగా చమురు ధరలను మార్చటం గత కొంతకాలంగా ఉన్నదే. ప్రతి నెలా 15వ తేదీన.. నెలాఖరు రోజున అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశీయ ధరల్లో మార్పులు చేర్పులు చేయటం గత కొద్దికాలంగా నడుస్తున్నదే.
తాజాగా లీటరు పెట్రోల్ మీద రూ.2.43.. డీజిల్ కు రూ.3.60 తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. తాజా తగ్గింపుతో లీటర్ పెట్రోల్ (హైదరాబాద్ లో) రూ.69.37.. డీజిల్ రూ.50.25కు చేరుకుంది. ధరలు పెంచేటప్పుడు లీటరుకు రూ.2.. రూ.3 చొప్పున పెంచేస్తే.. తగ్గించేటప్పుడు మాత్రం రూపాయి.. రూపాయిన్నర అంటూ గీసి గీసి తగ్గించటం తెలిసిందే. మోడీ సర్కారు కొలువు తీరిన కొత్తల్లో అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. చమురు ధరలు తగ్గటంతో థరలు తగ్గటం తమ గొప్పతనంగా గొప్పలు చెప్పారు.
ఆ పరిస్థితి ఒక్కసారి మారటంతో.. చమురు ధరల ప్రస్తావన తేవటం మానేశారు. అంతర్జాతీయంగా ధరలు ఎంతలా తగ్గిపోతే.. కేంద్రం ఎంత తగ్గించిందన్న విషయాన్ని చూస్తే షాక్ కలగక మానదు.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బ్యారెల్ గరిష్ఠంగా 105 డాలర్లకు టచ్ అయిన సమయంలో లీటర్ పెట్రోల్ ధర సుమారు రూ.83 (హైదరాబాద్ లో) వరకు టచ్ చేసింది. ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.69.37 (హైదరాబాద్)లో డిసైడ్ చేశారు. పైన చిల్లరని పక్కన పడేస్తే.. రూ.70 అనుకుందాం. అంటే.. బ్యారెల్ ముడిచమురు ధర అంతర్జాతీయ మార్కెట్ లో 105 డాలర్ల వరకు పలికినప్పుడు ధర 83 అయితే.. ప్రస్తుతం బ్యారెల్ ధర ఎంత ఉందన్న విషయం తెలిస్తే.. తాజా తగ్గింపు ఎంత దారుణమో ఇట్టే తెలుస్తుంది.
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ లో బ్యారెట్ ముడి చమురు 55 డాలర్లకు కాస్త అటూ ఇటూగా కొట్టుకుంటోంది. అంటే.. బ్యారెల్ కు సుమారు 50 డాలర్ల మేర తగ్గినా.. సగటు వినియోగదారుడికి మాత్రం లీటర్ మీద తగ్గింది 13 రూపాయిలు మాత్రమే. ఈజీగా అర్థమయ్యేందుకు సింఫుల్ గా.. మొద్దు లెక్కగా చెప్పాలంటే బ్యారెల్ పెట్రోల్ ధర సుమారు యాభై శాతం తగ్గితే.. సామాన్యుడికి మాత్రం పెట్రోలో ధరలో తగ్గింది కేవలం 15 శాత మాత్రమే. మరి.. 35 శాతం తగ్గిన ప్రయోజనం ఎక్కడికి వెళుతోంది? తమ హయాంలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించినట్లు చెప్పే ప్రభుత్వాలకు.. కనిపించకుండా పోయిన 35 శాతం గురించి ఎవరూ ఎందుకు ప్రశ్నించరు..?