Begin typing your search above and press return to search.

చిన్నపిల్లలకి టీకా ఇవ్వడానికి దరఖాస్తు చేసిన ఫైజర్ .. ఎక్కడ !

By:  Tupaki Desk   |   10 April 2021 9:30 AM GMT
చిన్నపిల్లలకి టీకా ఇవ్వడానికి దరఖాస్తు చేసిన ఫైజర్ .. ఎక్కడ !
X
ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారి కరోనా వైరస్ కి వ్యాక్సినేషన్ శరవేగంగా కొనసాగుతోంది. ఐతే కరోనా రిస్క్ ఎక్కువగా ఉన్న అధిక వయసుల వారికే మొదటి ప్రాధాన్యత కింద టీకా ఇస్తున్నారు. వ్యాక్సిన్ తయారు చేసిన కంపెనీలు చిన్న పిల్లలపై క్లినికల్ ప్రయోగాలు చేయలేదు. అందుకే పిల్లలకు టీకాలు ఇవ్వడం లేదు. ఐతే అమెరికాకు చెందిన ఔషధ సంస్థ ఫైజర్ సంచలన ప్రకటన చేసింది. తాము పిల్లలమైనా ప్రయోగాలు చేశామని.. తమ వ్యాక్సిన్ 100శాతం సమర్థవంతంగా పనిచేస్తోందని పేర్కొంది. 12 నుంచి 15 ఏళ్ల వయసున్న పిల్లలకు తమ వ్యాక్సిన్ సురక్షితమైనది, పిల్లల శరీరంలో అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటుచేస్తుందని బయోఎన్‌టెక్-ఫైజర్ ప్రకటించింది. అమెరికాలో 12 నుంచి 15 ఏళ్ల వయసున్న 2,260 మంది వ్యాలంటీర్లపై వ్యాక్సిన్ ప్రయోగాలు జరిగాయి. వ్యాక్సిన్ వేసుకున్న ఏ ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ రాలేదని ఫైజర్ అధ్యయనం పేర్కొంది.

అమెరికాలో 12 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు కరోనా వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి శుక్రవారం ఫైజర్ కంపెనీ.. యూఎస్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్కు దరఖాస్తు చేసింది. ప్రస్తుతం కోవిడ్ వ్యాక్సిన్‌ 16 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే అందుబాటులో ఉంది. రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఇతర నియంత్రణ సంస్థల నుంచి కూడా వ్యాక్సిన్‌ వినియోగ అనుమతులు పొందేందుకు దరఖాస్తు చేయనున్నట్లు ఫైజర్‌, జర్మనీకి చెందిన బయో ఎన్‌ టెక్‌ కంపెనీలు సంయుక్తంగా వెల్లడించాయి.

మార్చి చివర్లో 2,260 మంది పిల్లలపై నిర్వహించిన ట్రయల్స్ ట్రయల్స్‌ ఫలితాలను ఫైజర్-ఎన్ బయోటెక్ ఇటీవలనే ప్రకటించాయి. 12-15 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లల్లో వ్యాక్సిన్ వందశాతం ప్రభావంతంగా పని చేస్తుందని పేర్కొన్నాయి. ట్రయల్స్ ‌లో ఎటువంటి ప్రతికూల ప్రభావాలు నమోదు కాలేదని, మంచి ఫలితాలు వచ్చాయని వెల్లడించింది. టీకా వేసినప్పుడు పెద్దలు ఎలాంటి స్వల్ప అస్వస్థతకు గురయ్యారో అలానే చిన్న పిల్లల్లో తలెత్తిందని పేర్కొన్నాయి. స్వల్ప జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు వంటి చిన్న, చిన్న సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపింది. ఫైజర్‌-బయోఎన్‌ టెక్‌ వ్యాక్సిన్ దీర్ఘకాలిక రక్షణ, భద్రత గురించి మరింత సమాచారం కోసం తమ అధ్యయనాన్ని ఇంకా కొనసాగిస్తామని రెండు ఫార్మా కంపెనీలు పేర్కొన్నాయి. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే 12 నుంచి 15 ఏళ్ల వారికి కోవిడ్ వ్యాక్సిన్ వేయడం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.