Begin typing your search above and press return to search.
కేసీఆర్ చండీ యాగానికి సీమ శాస్త్రిగారు
By: Tupaki Desk | 2 Nov 2015 6:17 AM GMTతన ఫాంహౌస్ లో తెలంగాణ సుఖ శాంతుల కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అయుత చండీయాగానికి సంబంధించిన పనులు జోరుగా సాగుతున్నాయి. డిసెంబరు 23 నుంచి 27వ తేదీ వరకూ నిర్వహించే చండీయాగాన్ని భారీగా నిర్వహించాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఏర్పాట్ల కోసం జోరుగా పనులు సాగుతున్నాయి. యాగాన్ని నిర్వహించేందుకు వీలుగా 30 ఎకరాల్ని చదును చేసి సిద్ధం చేస్తున్నారు.
ఈ కార్యక్రమాన్ని దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రుత్వికులు నిర్వహించనున్నారు. దాదపు 1100 మందిక పైగా రుత్వికులు హాజరుకానున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. చండీయాగానికి సంబంధించి పనుల్ని శృంగేరి పీఠాధిపతి శిష్యులు నిర్వహిస్తున్నారు. వీరిలో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారితో పాటు.. రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు ఉండటం విశేషం. కేసీఆర్ క్షేత్రంలో నిర్వహిస్తున్న చండీయాగానికి కర్నూలు జిల్లాకు చెందిన ఫణిశశాంక శర్మ దగ్గర ఉండి ఏర్పాట్లు చూసుకుంటున్నారు.
ప్రాంతీయ నినాదాన్ని బలంగా వినిపించి.. ప్రతి విషయంలోనూ ప్రాంతాల ప్రస్తావన తీసుకొచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న చండీయాగానికి సంబంధించిన కీలక ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న వారిలో సీమ శాస్త్రి ఉండటం కాస్తంత ఆసక్తికరమే. ఇక చండీయాగానికి సంబంధించిన పనుల్ని దగ్గరుండి చూసుకోవటానికి వీలుగా ఇద్దరు ఎమ్మెల్యేలు.. ఒక నేతతో పాటు.. ఒక మీడియా ప్రతినిధిని ఏర్పాటు చేయటం గమనార్హం. రానున్న రోజుల్లో చండీయాగానికి సంబంధించి మరెన్ని ఆసక్తికర కోణాలు వెలుగులోకి వస్తాయో..?