Begin typing your search above and press return to search.

సినిమాల ప్రభావం: ప్రియురాలిపై చూపించాడు!

By:  Tupaki Desk   |   20 Oct 2016 10:17 AM GMT
సినిమాల ప్రభావం: ప్రియురాలిపై చూపించాడు!
X
సినిమాల మీద జనాల ప్రభావం ఎంతుదో తెలియదు కానీ.. జనాల మీద మాత్రం సినిమాల ప్రభావం బాగానే ఉందని నిరూపించడానికి ఇప్పటికే చాలా సంఘటనలు వెలుగుచూశాయి. అయితే తాజాగా మరోసారి ఆ ప్రభావం జనాల మీద ఎంతుందో నిరూపించే సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సందేశాత్మక సినిమాలు వస్తున్నాయా లేదా అనే సంగతి కాసేపు పక్కనపెడితే - వచ్చే కొద్ది పాటి మంచి సినిమాల్లో అయినా ఉన్న మంచిని గ్రహించాలి లేదంటే చూసి ఎంజాయ్ చేసి లైట్ తీసుకోవాలి. కానీ... తాను చేయబోయే ఒక దారుణమైన పనికి - హింసను ప్రేరేపించే సన్నివేశాలను చూసి ప్రేరణ పొందిన యువకుడు తన ప్రియురాలినే హతమార్చాడు. అనంతరం తాను చూసిన ఆ సినిమాలో హీరో ఎలా తప్పించుకునే ప్రయత్నం చేస్తాడొ అదే క్రమంలో తనవంతు ప్రయత్నం చేశాడు. అలా చేసిన తన ప్రయత్నంలో ఒక ఏడాదిపాటు సక్సెస్ అయినా... తాజాగా దొరికిపోయాడు!!

నిజ జీవితానికి సినిమాలోని సన్నివేశాలకీ ఉన్న తేడా ఇప్పటికైనా గ్రహించాడో లేదో కానీ... బెంగళూరులోని గాంధీ క్రిషి విఘ్యాన్ కేంద్రంలో చదువుతున్న అరుణ్ - విజయపురలో బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న అర్పిత ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఆ క్రమంలో కొంతకాలం పాటు హాయిగా సాగిన వీరి ప్రేమప్రయాణంలో ఒకరోజు పెళ్లి ప్రస్థావన తీసుకొచ్చింది అర్పిత. అయితే పీహెచ్‌ డీ చేయడానికి వెళ్లాలని నిర్ణయించుకున్న అరుణ్ ఈ విషయంలో ఆమెతో ఏకీభవించలేదు. అయితే ఆమె పదే పదే పెళ్లిచేసుకోవాలని ఫోన్ చేయడంతో దీనికి పరిష్కారం ఆమెను చంపడమే అనే దుర్మార్గపు ఆలోచనకు వచ్చాడు అరుణ్. అక్కడినుంచి మొదలైంది అసలు కథ.

అర్పితను చంపాలని నిర్ణయించుకున్న అరుణ్... కన్నడ మూవీ దృశ్య సినిమాను చూసి - హత్య చేసినా కూడా తప్పించుకోవచ్చులే అని ఒక నిర్ణయానికి వచ్చాడట. దీంతో ఒకరోజు ఆమెతో ధర్వాద్ లో కలుసుకుందామని ఫోన్ చేసి రమ్మన్నాడు. అనంతరం ప్రియుడి మాటలు నమ్మిన అర్పిత ఆటోరిక్షాలో రాగా - ఆమెను గబ్బూర్ ప్రాంతానికి తీసుకెళ్లి గొంతునిలిమి చంపేసి - ఆమె మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం ఏమీ తెలియనట్లు బెంగళూరుకు చేరుకున్నాడు. అయితే ఇదే క్రమంలో ఆ రోజు కూడా కాలేజీకి వచ్చినట్లు నమ్మించడానికి అటెండెన్స్ ను మార్చేశాడు. దీంతో ఆ రోజు ఇతడు బెంగళూరులోనే ఉన్నట్లు పోలీసులు నమ్ముతారనేది ఆలోచన.

అయితే ఆమె మృతదేహాన్ని ఎక్కడైతే తగ్లబెట్టాడో ఆ పొలం యజమాని తనపొలంలో సగం కాలిన మృతదేహం ఉండటాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం ఆ మృతదేహం అర్పితది అని ధ్రువీకరించిన పోలీసులు అర్పిత తల్లితండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి ఎట్టకేలకు ఈ మర్డర్ మిస్టరీని ను చేధించారు. కాగా ఈ హత్య 2015 జూన్ లో జరిగింది. ఈ దృశ్యం చిక్కుముడి వీడటానికి సంవత్సరం పైనే పట్టిందన్నమాట!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/