Begin typing your search above and press return to search.
హైదరాబాద్ యూనివర్సిటీలో మరో కలకలం
By: Tupaki Desk | 7 Feb 2016 10:00 AM GMTహైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో మళ్లీ కలకలం రేగింది. కేరళకు చెందిన సురేష్ అనే విద్యార్థి కనిపించకుండా పోయాడు.యూనివర్శిటీలో పి.హెచ్.డి. చేస్తున్న ఈ విద్యార్థి గత కొద్ది రోజులుగా కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కాగా ఆ విద్యార్థి గత కొద్ది కాలంగా మానసిక ఒత్తిడికి గురి అవుతున్నాడని చెబుతున్నారు.ఈ విషయంపై యూనివర్శిటీ అదికారులు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
ఇప్పటికే సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ అనే స్కాలర్ ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ వ్యవహారంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండుసార్లు సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చారు. ఒక రోజంతా నిరాహార దీక్ష చేశారు. విద్యార్థులు కూడా ఆందోళనలకు దిగారు. ఆప్ - బీఎస్సీ - తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీల నేతలు కూడా సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చి ఏం జరిగిందో తెలుసుకున్నారు. పలు రాష్ట్రాల్లో విద్యార్థులు ఈ సంఘటనపై ఆందోళనలు చేశారు. సెంట్రల్ వర్సిటీ గందరగోళంగా మారి తరగతులు కూడా కొద్దిరోజులు జరగలేదు.
ఆ వివాదం ఇంకా సమసిపోకముందే తాజాగా మరో పీహెచ్ డీ విద్యార్థి కనిపించకపోవడం సంచలనంగా మారింది. ఆయనేమయ్యాడు.. ఆయనకు ఆపదేమైనా జరిగిందా..? లేదంటే ఎక్కడికైనా వెళ్లాడా..? మానసిక సమస్యలే కారణమా.. లేదంటే ఇంకేవైనా కారణాలు ఉన్నాయా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.