Begin typing your search above and press return to search.
ఈ దేశ అధ్యక్షుడు ముగ్గుర్ని కాల్చేశాడు
By: Tupaki Desk | 17 Dec 2016 6:27 AM GMTకీలక స్థానంలో ఉన్న వారి వ్యక్తిగత జీవితం కాలం గడిచినప్పటికీ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. పిలిప్పీన్స్ దేశాధ్యక్షుడు డుటెర్టి తాజాగా వెల్లడించిన సమాచారం ఇదే కోవలోకి చెందేది. తాను మేయర్ గా ఉన్నప్పుడు ముగ్గుర్ని కాల్చి చంపినట్లు అంగీకరించారు. ఓ టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. దావో నగరానికి డుటెర్టి సుమారు రెండు దశాబ్ధాల పాటు మేయర్ గా ఉన్నారు. అయితే ఆ సమయంలో నేరాలకు పాల్పడ్డ ముగ్గుర్ని పిస్తోల్ తో కాల్చి చంపారు. వాళ్లకు ఎన్ని బుల్లెట్లు దిగాయో తెలియదు - కానీ అది నిజం - నేను అబద్దాలు చెప్పడం లేదంటూ పిలిప్సీన్స్ దేశాధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల ప్రెసిడెంట్ ప్యాలెస్ లో జరిగిన సమావేశంలో డుటెర్టి డ్రగ్ నేరస్తుల గురించి మాట్లాడారు. ఆ సమావేశంలో వ్యాపారవేత్తలతో మాట్లాడుతూ దావోలో తాను సాగించిన వేట గురించి వివరించారు. డ్రగ్ నేరస్తులను ఏ రకంగా అణిచివేయాలని డుటెర్టి ఆ సమావేశంలో సూచించారు. మేయర్ గా ఉన్నప్పుడు తాను కూడా ముగ్గుర్ని చంపినట్లు చెప్పారు. అయితే ఈ అంశాన్ని తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డుటెర్టి ఒప్పుకున్నారు. కొన్ని నెలల క్రితం దేశాధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన డుటెర్టి డ్రగ్ నేరస్తులపై ఉక్కుపాదం మోపారు. దాదాపు 6 వేలకుపైగా డ్రగ్ నేరస్తులను హతమార్చారు. అయితే ఆ కాల్చివేతల వెనుక డుటెర్టి హస్తం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తన పదవీ కాలం ముగిసే వరకు డ్రగ్ డీలర్ల భరతం పడుతానని డుటెర్టి ప్రతిజ్ఞ కూడా చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/