Begin typing your search above and press return to search.
మరోసారి వార్తల్లో క్రికెటర్ హ్యూస్ మరణం!
By: Tupaki Desk | 11 Oct 2016 11:46 AM GMTరెండేళ్ల కిందట ఆసీస్ దేశవాళీ మ్యాచ్ ఒకదాంట్లో బౌన్సర్ గా దూసుకొచ్చిన బంతి తగిలి మరణించిన ఫిలిఫ్ హ్యూస్ విషాద మరణాన్ని ఎవరూ మరచిపోలేదు. మైదానంలో బంతి బలంగా తగలడంతో ఆస్పత్రిలో చేరాడు. అయితే బలమైన గాయం కావడంతో హ్యూస్ కోమాలోకి వెళ్లిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం మృత్యువుతో పోరాడి అతడు ఓడిపోయాడు!! అయితే ఇప్పుడు ఆ ఘటనపై న్యాయ విచారణ జరుగుతుండటంతో అతడి మరణం అప్పుడు అంతర్జాతీయంగా మరోసారి చర్చనీయాంశం అయ్యింది. ఫిలిప్ హ్యూస్ కు సీన్ అబాట్ బౌన్సర్ విసిరిన ఆ మ్యాచ్ కు సంబంధించి ప్రత్యర్థి జట్టు వ్యూహ ప్రతివ్యూహాలు - స్లెడ్జింగ్ కు సంబంధించి ప్రతీ చిన్న విషయంపైనా అధికారులు విచారణ జరుపుతున్నారట.
అయితే ఈ క్రమంలో హ్యూస్ పై పదే పదే షార్ట్ పిచ్ బంతులు విసరాలని న్యూ సౌత్ వేల్స్ కెప్టెన్ బ్రాడ్ హాడిన్ చెప్పినట్లు విచారణలో తేలగా - ఒకదశలో హ్యూస్ వద్దకు వచ్చిన బొలింజర్ "నిన్ను చంపబోతున్నాను" అని కూడా వ్యాఖ్యానించినట్లు మరో క్రికెటర్ విచారణలో వెల్లడించాడట. ఈ విషయాలు బయటకు రావడంతో ఒక్కసారిగా హ్యూస్ మరణం వెనక కుట్ర దాగిఉందా అనే కథనాలు వెలువడుతున్నాయి. అయితే బొలింజర్ ఈ విషయాన్ని ఖండించాడు. అయితే ఇవే కారణాలు హ్యూస్ మృతికి కారణమని చెప్పకపోయినా... విచారణ అధికారులు తమ దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
కాగా అప్పట్లో ఫిలిఫ్ హ్యూస్ కు బంతి తలకు తగలడం వల్ల కోమాలోకి వెళ్ళిపోవడానికి పాత హెల్మెట్ వాడటమే కారణమని బ్రిటన్ కు చెందిన క్రికెట్ రక్షణ ఉపకరణాల తయారీ సంస్థ "మసూరి" తెలిపింది. హ్యూస్ కు తల వెనుక మెడ భాగంలో దెబ్బ బలంగా తగిలిందని, ఆ భాగాన్ని హెల్మెట్లు పూర్తిగా కవర్ చేయలేకపోతున్నాయని అప్పట్లో "మాసురి" పేర్కొంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/