Begin typing your search above and press return to search.
ఫోన్ నెంబరు కోసం ఏకంగా రూ.8కోట్లు
By: Tupaki Desk | 28 Feb 2017 4:43 AM GMTనెంబర్ల మీద కొద్దిమందికి ఉండే ఆసక్తి అంతాఇంతా కాదు. అందుకే.. తాము అనుకున్న నెంబరును సొంతం చేసుకోవటానికి ఆర్డీఏ నిర్వహించే నెంబర్ల ఆక్షన్ లో లక్షలాది రూపాయిల్నిఖర్చు చేయటం మనకు తెలిసిందే. తాజా ఉదంతాన్నివింటే.. ఖరీదైన కార్ల కోసం పెట్టే ఖర్చు లెక్క చిన్నపోవటమే కాదు.. సెల్ ఫోన్ కోసం భారతీయుడు ఒకరు పెట్టిన ఖర్చు ముచ్చట తెలిస్తే.. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందంతే.
దుబాయ్ లో ఉండే ప్రవాస భారతీయుడు మాంచి సౌండ్ పార్టీ. ఆయనకు దుబాయ్ లో నిర్వహిస్తున్న ఫోన్ నెంబరు వేలానికి వెళ్లాడు. అందరిమదిని దోచిన ‘‘0588888888’’ ఫోన్ నెంబరు కోసం ప్రయత్నించాడు. తాను మనసు పడిన నెంబరును సొంతం చేసుకోవటానికి లక్షల్ని దాటేసి.. కోట్లు ఖర్చు పెట్టేందుకు వెనుకాడలేదు. మొత్తం 80 మంది ఈ ఫ్యాన్సీ నెంబరును సొంతం చేసుకోవటానికి ప్రయత్నించారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. దుబాయ్ గడ్డ మీద డబ్బులున్న షేకుల్ని సైతం షేక్ చేసేలా భారీ మొత్తాన్ని ఫోన్ నెంబరు కోసం పెట్టేశారు. వేలంపాటలతో అంతకంతకూ పెరిగిన పోటీ కారణంగా.. భారీ ధరకు తాను మెచ్చిన నెంబరును సొంతం చేసుకున్నారు ప్రవాసభారతీయుడు.. వ్యాపారవేత్త బల్వీందర్ సహాని. ఇంతకూ ఫోన్ నెంబరు కోసం ఆయన పెట్టిన ఖర్చు ఎంతో తెలుసా? అక్షరాల.. రూ.8.10కోట్లు. ఫోన్ నెంబరు కోసం ఇన్ని కోట్లు ఖర్చు చేస్తారా? అని అవాక్కు అవ్వాల్సిన పని లేదు.
ఎందుకంటే.. కోట్లు పెట్టి ఫోన్ నెంబరును సొంతం చేసుకున్న సహానికి.. ఖరీదైన నంబర్స్ ను సొంతం చేసుకోవటం ఒక హాబీనట. గతంలో నంబర్ ‘‘5’’ ప్లేట్ ను సొంతం చేసుకోవటం కోసం ఏకంగా రూ.30కోట్లు ఖర్చు పెట్టేందుకు వెనుకాడని ఘన చరిత్ర సహనీ సొంతం సుమా. ఈ ఎపిసోడ్ మొత్తాన్ని వింటే.. నంబర్ల కోసం ఇన్నేసి కోట్లు ఖర్చు పెట్టేస్తారా? అనిపించక మానదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/