Begin typing your search above and press return to search.

బాయ్ ఫ్రెండ్ మాట్లాడడం లేదని పోలీసులకు ఫోన్

By:  Tupaki Desk   |   21 Nov 2021 4:35 AM GMT
బాయ్ ఫ్రెండ్ మాట్లాడడం లేదని పోలీసులకు ఫోన్
X
వారిద్దరూ ఘాడంగా ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేమంటున్నారు. కానీ ప్రియుడి పుట్టిన రోజునాడు ఆ ప్రియురాలు శుభాకాంక్షలు చెప్పడం మరిచిపోయింది. అప్పటి నుంచి కోపంతో ఉన్న ప్రియుడు మాట్లాడడం మానేశాడు. అది తట్టుకోలేకపోయిన ప్రియురాలు చేసిన పనికి పోలీసులు షాక్ అయ్యారు.

ప్రేమికులు విరహాన్ని తట్టుకోలేకపోయారు. ఎడబాటును తట్టుకోవడం లేదు. డీప్ లవ్ లో ఉన్న వాళ్లైతే విడిచి ఉండడం లేదు. ప్రేమికులు అన్నాక అలకబూనడాలు ఉంటాయి. ఆ మాత్రం గొడవలు లేకపోతే ఎలా అంటుంటారు లవర్స్. కోపతాపాలకు బతిమిలా.. బామాలో బహుమతులు ఇచ్చో లవ్ ట్రాక్ ను కంటిన్యూ చేస్తుంటారు. అయితే ఓ ప్రియురాలు తన ప్రియుడి కోసం చేసిన పని చూసి పోలీసులు అవాక్కయ్యారు.

బాయ్ ఫ్రెండ్ తనతో మాట్లాడడం లేదని.. ఎలాగైనా అతడితో మాట్లాడించాంటూ ఓ ప్రియురాలు నేరుగా 100 నంబర్ కు డయల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 100 నంబర్ కు ఫోన్ హడావుడిగా చేయడంతో పోలీసులు అవాక్కయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఛింద్వారాలో చోటుచేసుకుంది.

మొదట ఆమె తన లవర్ మాట్లాడడం లేదని చెప్పకుండా అత్యవసరం అన్నట్టు కాల్ చేసింది. తనకు అన్యాయం జరుగుతోందని.. వెంటనే ప్రియుడిని కలిసేలా చూడాలని కోరింది. దీంతో పోలీసులు కంగారుపడ్డారు. విషయం తెలుసుకొని అవాక్కయ్యారు. పుట్టినరోజు వేడుకకు ప్రియురాలు రాకపోవడంతో ఆ ప్రియుడు గొడవ పెట్టుకొని ఇలా అలకబూనినట్టుత ెలిసింది. మాట్లాకపోవడంతో ప్రియురాలు ఏకంగా పోలీసులకు ఫోన్ చేసి చెప్పింది.