Begin typing your search above and press return to search.
ఆరే.. ఆ ఫోటోతో అంత మోసం చేశారా?
By: Tupaki Desk | 21 Jan 2016 10:19 AM GMT2014 ఎన్నికల సమయంలో ఓ ఫోటో దేశ వ్యాప్తంగా హడావుడి చేసింది. నాడు ప్రధాని అభ్యర్థిగా బరిలో ఉన్న నరేంద్రమోడీకి చెందిన ఒక ఫోటో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది.ఈ ఫోటో విపరీతమైన స్ఫూర్తిని రగల్చటమే కాదు.. ఇంతటి కిందిస్థాయి వ్యక్తి దేశప్రధానిగా మారితే.. దేశ భవిష్యత్తు మొత్తంగా మారిపోతుందన్న సానుకూలత వ్యక్తమైంది. దేశ ప్రజల్ని ఇంతగా ప్రభావితం చేసిన సదరు ఫోటోలు మోడీ చీపురు పట్టుకొని ఊడుస్తూ కనిపిస్తారు.యువకుడిగా ఉన్నప్పుడు మోడీ ఎంతగా కష్టపడిందంటూ బీజేపీ నేతలు గొప్పలు చెప్పటం కనిపిస్తుంది.
అయితే.. ఆ ఫోటో ఏమాత్రం నిజం కాదని..మార్ఫింగ్ చేసిందన్న విషయం తాజాగా బయటకు వచ్చింది. అహ్మదాబాద్ కు చెందిన ఒక వ్యక్తి ఈ ఫోటో విషయమైన ఆర్ టీఐని ఆశ్రయించిన సందర్భంలో ఈ ఫోటోలో ఉన్నది మోడీ కాని.. అది మార్ఫింగ్ అయి ఉంటుందని తేల్చారు. మోడీ టీ అమ్మారు..చీపురు పట్టుకొని ఊడ్చారు.. ఇలా ఎన్నో మాటలు ప్రచారం జరిగాయి. అయితే.. ప్రచారానికి.. నిజానికి మధ్య వ్యత్యాసం ఎంత ఉందన్న విషయం తాజా ఉదంతంతో నిరూపితమైంది. కదిలించే ఫోటోలన్నీ నిజం కాదని తేలిపోయింది. మరి ఇలాంటి జిమ్మిక్కులు రానున్న రోజుల్లో మరెన్ని బయటకు వస్తాయో..?