Begin typing your search above and press return to search.
ఏపీలో వర్షాల తీవ్రతను చెప్పే ఫోటో.. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది?
By: Tupaki Desk | 23 Nov 2021 4:09 AM GMTవర్షం.. ఆకాశానికి చిల్లు పడినట్లుగా ధారాపాతంగా కురిసిన వర్షాలకు ఏపీలోని కొన్ని కీలక పట్టణాలు అతలాకుతలమైపోయాయి. ఎప్పుడూ లేని రీతిలో కొన్ని జిల్లాల్లో చోటు చేసుకున్న దారుణ పరిస్థితుల్నిచూస్తే.. జీర్ణించుకోవటం కష్టంగా మారింది. విడవకుండా కురిసిన వానలతో చిత్తూరు.. కడప.. అనంతపురం.. నెల్లూరు జిల్లాలు తీవ్రంగా ప్రభావానికి లోనయ్యాయి. ఇక.. తిరుపతి.. కడప.. నెల్లూరు.. చిత్తూరు పట్టణాల పరిస్థితి దారుణంగా మారింది. ఈ పట్టణాల్లోని పలు ప్రాంతాలు వరద నీటిలోనే చిక్కుకుపోయి ఉన్నాయి.
సోమవారానికి వర్షం తెరిపినిచ్చినప్పటికీ వరద ప్రభావం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికి పలు కాలనీల్లో నీరు అలానే నిలిచి ఉండటంతో ప్రజలు కిందా మీదా పడుతున్నారు. చెరువులు కట్టలు తెగిపోవటం.. వంతెనలు దెబ్బతినటం.. రోడ్లు మరింత దారుణంగా తయారు కావటమే కాదు.. ప్రజా రవాణా విషయంలోనే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా ఏపీలోని పలు ప్రాంతాలకు చేదు గురుతుల్ని మిగిల్చింది తాజాగా కురిసిన భారీ వర్షం.
భారీ వర్షాల కారణంగా పరిస్థితి ఎలా ఉందన్న విషయానికి నిలువెత్తు నిదర్శనంగా తిరుపతిలోని ఆటోనగర్ ను చూస్తే విషయం ఇట్టే అర్థమైపోతుంది. నాలుగు రోజులుగా అక్కడి వరద పోటు ఇప్పటికి తగ్గని పరిస్థితి. పలు చోట్ల విద్యుత్ సరఫరాను పునరుద్దరించని పరిస్థితి. చిత్తూరు జిల్లాలో 75 చెరువులకు గండ్లు పడితే.. 456 చెరువులు దెబ్బ తిన్నాయి. ఇలా.. చిత్తూరు జిల్లాలోనే కాదు మిగిలిన మూడు జిల్లాల్లోనే పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.
ప్రజాజీవనానికి ఏ మాత్రం అనువుగా లేని రీతిలో వర్షాలు దారుణంగా దెబ్బ తీశాయి. పలుచోట్ల భారీ వర్షం.. వరద కారణంగా కొట్టుకుపోయిన రోడ్లను పునరుద్ధరిస్తున్నారు. కడప జిల్లాలో పెనగలూరు మండలంలోని పలు గ్రామాల(దిగువ సిద్దవరం ఎస్సీ కాలనీ.. కోడిచెన్నయ్యగారి పల్లె.. పద్మయ్యగారి పల్లె.. నరసింగరాజపురం.. పల్లంపాడు)కు వెళ్లే రోడ్లు దెబ్బ తినటంతో గడిచిన నాలుగైదు రోజులుగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అన్నమయ్య జలాశయం కట్ట తెగిపోవటంతో వచ్చిన వరద ఇంకా తొలిగిపోలేదు. విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించలేదు.
పలు కుటుంబాల వారు వరద కారణంగా ఇళ్లను వదిలిపెట్టి.. పునరావాస కేంద్రాలకు వెళ్లిపోతున్నారు. మొత్తంగా భారీ వర్షాలు ఏపీ వాసులకు చేదు గురుతుల్ని మిగల్చటంతో పాటు.. భారీ విషాదాన్ని మిగిల్చాయి. పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని..కష్టంలో ఉన్న తమకు అందుతున్న సహాయచర్యల మీద పెదవి విరుపు కనిపిస్తోంది.