Begin typing your search above and press return to search.
నకిలీ 2వేల నోటు...తయారీ ఇంత ఈజీనట?!
By: Tupaki Desk | 22 Dec 2016 9:42 AM GMTఎంతో పకడ్బందీగా నకిలీలు సృష్టించడం అసాధ్యమనేలా స్వదేశంలోనే కొత్త నోట్లు తయారు చేశామని ప్రభుత్వం చెబుతున్నా.. కొందరు మాత్రం ఎంతో ఈజీగా వాటిని కాపీ కొట్టేస్తున్నారు. ఎంత ఈజీగా అంటే... ఓ జిరాక్స్ మెషీన్.. కాస్త మెరుపు ఉంటే చాలు కొత్తగా వచ్చిన రెండు వేల నోటుకు నకిలీ సృష్టించడం పెద్ద కష్టమేమీ కాదంట. బెంగళూరుకు చెందిన నలుగురు వ్యక్తులు ఇలాగే నకిలీలు సృష్టించడమే కాదు.. వాటిని కొన్ని షాపుల్లో వాడటం కూడా గమనార్హం. ఈ నలుగురినీ పోలీసులు అరెస్ట్ చేసే సమయానికి వాళ్లు ఈ నకిలీ నోట్లను 8 లిక్కర్ షాపుల్లో వాడేశారు.
బెంగళూరుకు చెందిన శశాంక్ - మధుకుమార్ అనే ఇద్దరు వ్యక్తులు కొత్త 2000 నోటును జిరాక్స్ మెషీన్ ఉపయోగించి కాపీ చేశారు. ఆ తర్వాత దానిని కరెక్ట్ సైజుకు కట్ చేశారు. ఓ మెరుపు పెన్ను సాయంతో మధ్యలో ఉండే ఆకుపచ్చ రంగు గీత గీశారు అని పోలీస్ అధికారి ఎంఎన్ అనుచేత్ వెల్లడించారు. కిరణ్ కుమార్ - నాగరాజు అనే మరో ఇద్దరు కూడా నకిలీ నోట్లను సృష్టించే ప్రయత్నం చేశారు. ఆ నకిలీ నోటునో ఓ షాప్ యజమాని అనుమానించి పోలీసులకు సమాచారమివ్వడంతో విషయం బయటపడింది. తమ ఫ్రెండ్ షాపులో ఉన్న ఓ జిరాక్స్ మెషీన్ లో మొదట 25 నకిలీ నోట్లను వీళ్లు సృష్టించారు. ఈ నకిలీ నోట్లు తయారుచేసిన వారిలో ఒకరు మెకానిక్ కాగా.. మరొకరు ఆటో డ్రైవర్. వీళ్లు ఎనిమిది వైన్ షాపుల్లో వాడిన ఆ నోట్లను ఇప్పటికీ వెనక్కి తీసుకున్నామని, మొత్తం 25 నోట్లను తిరిగి తీసుకుంటామని అనుచేత్ చెప్పారు. ఈ నోట్లను చూస్తే అచ్చూ అసలు నోట్లలాగే అనిపించేలా వీళ్లు తయారుచేశారు. ఇది ప్రస్తుత పరిస్థితి. సో కొత్త విషయంలో కాస్త జాగ్రత.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/