Begin typing your search above and press return to search.

వైరల్ ఫొటో: ఎద్దును ఏం చేశారో చూడండి

By:  Tupaki Desk   |   15 Aug 2018 1:30 AM GMT
వైరల్ ఫొటో: ఎద్దును ఏం చేశారో చూడండి
X
ముస్లింలు త్యాగానికి నిర్వచనంగా చెప్పుకునే బక్రీద్ పండుగకు వేళయ్యాంది. ఈ పండుగ నాడు వారు పెద్ద ఎత్తున జీవహింసకు పాల్పడుతారు. ముఖ్యంగా గొర్రెలు - మేకలు - గోవులను బలిస్తుంటారు. గోవును వధించడాన్ని భారత్ లో తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. కానీ పాకిస్తాన్ దేశంలో బక్రీద్ పండుగకు ఎలాంటి ఆంక్షలు ఉండవు.

అయితే బక్రీద్ పండుగ ను పురస్కరించుకొని పాకిస్తాన్ దేశంలోని కరాచీలో ఓ ఎద్దును వేలం వేయాలనుకున్నాడు ఓ వ్యాపారి. తన మూడంతస్తుల బిల్డింగ్ పైన ఉన్న పశువుల పాక నుంచి దాన్ని కిందకు దించేందుకు అమానుష చర్యకు పాల్పడ్డాడు. ఎద్దును తాళ్లతో బంధించి.. దాని మూతికి ప్లాస్టిక్ తాడు కట్టి.. క్రేన్ సాయంతో దాన్ని కిందకు దించాడు. ఎద్దు కొమ్ముకు పాకిస్తాన్ జెండాలను కూడా కట్టాడు. ఓ అసోసియేట్ ప్రెస్ ఫొటో గ్రాఫర్ ఈ ఫొటోను తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది పెద్ద వివాదాస్పదమైంది.

మూగజీవిని చంపి తింటారా అని చాలా మంది కామెంట్లు పెట్టగా.. పాకిస్తానీలు మాత్రం మా పండుగకు ఇదే విందు అంటూ కామెంట్లు పెట్టారు. ఈనెల 22 బక్రీద్ పండుగ సందర్భంగా ఈ పరిణామం చోటుచేసుకుంది. దీనిపై జంతు ప్రేమికులందరూ నిరసన వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.