Begin typing your search above and press return to search.
ఐసోలేషన్ వార్డ్ లో ఆలా వాటేసుకున్న దంపతులు ... ఫోటో వైరల్ !
By: Tupaki Desk | 16 April 2020 12:29 PM GMTయావత్ ప్రపంచాన్ని ఇప్పుడు కరోనా మహమ్మారి వణికిపోయేలా చేస్తుంది. ఈ సమయంలో వైద్యలు దేవుళ్లులా కనిపిస్తున్నారు. డాక్టర్లు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఈ మహమ్మారిపై పోరాడుతున్నారు. తమ కుటుంబాలకు సైతం దూరంగా ఉంటూ తమ సేవలందిస్తున్నారు. తాజాగా ఫ్లోరిడాలో నివాసముంటున్న నర్స్ దంపతుల ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. వారి కథ ఏంటో ఇప్పుడు చూద్దాం ..వారి కథ తెలుసుకుంటే ప్రతి ఒక్కరు వారికీ హ్యాట్సాప్ చెప్పాల్సిందే.
అమెరికాలోని ఫ్లోరిడా నగరంలో కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ జంట కరోనావైరస్ పోరాటంలో భాగస్వాములయ్యారు. బెన్ కేయర్, మరియు మైండీ బ్రాక్ అనే ఈ కపుల్ వృత్తి పరంగా నర్సులు. ఇద్దరూ ఒకే హాస్పిటల్‌లో పనిచేస్తున్నారు. కానీ ఒకరికొకరు దూరంగా ఉంటూ కొన్ని రోజులుగా ఒకరినొకరిని చూసుకోలేదు. అయితే కరోనా వైరస్ వార్డుల్లో బిజీగా ఉన్న ఈ జంట చివరకు ఒకరినొకరు కలుసుకున్నారు. దీనితో కొంత ఉద్వేగానికి లోనై , వారు సంరక్షణ దుస్తులను ధరించి ఒకరినొకరు కౌగలించుకుంటున్న సందర్భంలో పక్కనే ఉన్న మరో వ్యక్తి ఫోటోలు తీశారు.
ఈ ఫోటో సోషల్ మీడియాలో పోస్టు చేయగానే ఎంతో మంది నెటిజెన్లను ఆకట్టుకుంది. అంతేకాదు ఈ విపత్కర సమయాల్లో ఈ దంపతులు చేస్తున్న సేవలను కొనియాడింది. ఎన్నో కలలు కని కొత్త జీవితం ప్రారంభించాలనుకున్న ఈ నవ దంపతులు ఇలా కరోనావైరస్ మహమ్మారి పై పోరాడుతుండటం నిజంగా అభినందనీయమని నెటిజెన్లు కామెంట్ల ద్వారా తెలిపారు. ఈ ఫోటో ఒక్కసారిగా వైరల్ కావడంతో ఈ ఫోటో గురించి చాలామంది చర్చించుకుంటున్నారు.
ఇక వీరి లవ్ స్టోరీ 2007లో ప్రారంభమైంది. ఇద్దరూ అనెస్తీషియా స్కూల్‌లో కలిశారు. అక్కడే వీరిద్దరి మధ్య ప్రేమ బలపడింది. ఐదేళ్ల క్రితం వీరు పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు ఒకే మాటపై నిలబడుతారు. అందుకే ప్రాణాలకు సైతం తెగించి ఒకే హాస్పిటల్‌లో కరోనావైరస్ పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారు. పేషెంట్ల నోట్లో పైపులు పెట్టడం కూడా చేస్తున్నారు. అయితే వారి నుంచి చిన్న బిందువు వీరిపై పడ్డా అది ఎంత ప్రమాదంకు దారి తీస్తుందో తెలిసి కూడా వారు చికిత్స అందించేందుకు ముందుకొచ్చారు.