Begin typing your search above and press return to search.
పిక్ ఆఫ్ ది డే: తల్లితో గుజరాత్ లో ఆహ్లాదంగా గడిపిన మోడీ
By: Tupaki Desk | 12 March 2022 10:30 AM GMTప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం తన సొంత రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో ఉన్నారు. రెండేళ్ల విరామం తర్వాత శుక్రవారం రాత్రి గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో మోదీ తన తల్లి హీరాబెన్‌ను పరామర్శించారు.
యూపీ, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌తో సహా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీని విజయపథంలో నడిపించిన ఒక రోజు తర్వాత మోడీ తన వేడుకలను గుజరాత్ లోనే తల్లి సమక్షంలో జరుపుకున్నారు. తల్లితో ఆహ్లాదంగా గడిపారు.
మోడీ తన తల్లితో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రత్యక్షమయ్యాయి. తల్లీ కొడుకులిద్దరూ కలిసి భోజనం చేయడం చూడవచ్చు. హీరాబెన్ ఆశీస్సులు మోదీ తీసుకుంటున్నట్లు మరో చిత్రంలో చూపించారు.
తన బిజీ షెడ్యూల్‌లో మోడీ తన వృద్ధురాలైన తల్లితో కొన్ని గంటలు గడపాలని నిర్ణయించుకున్నాడు. మోడీ తల్లి అతని తమ్ముడితో కలిసి నివసిస్తుంది. మోడీ అహ్మదాబాద్‌కు వచ్చినప్పుడల్లా తన తల్లిని ప్రతీసారి సందర్శిస్తుంటాడు.
మరోవైపు అహ్మదాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ నేతలు, కార్యకర్తలతోనూ మోదీ సమావేశమయ్యారు. ఆయన గుజరాత్ విమానాశ్రయం నుంచి బిజెపి కార్యాలయం వరకు రోడ్‌షో కూడా నిర్వహించారు.
ఇక ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం గుజరాత్ నాయకులతో కూడా ప్రధానమంత్రి ఎన్నికల వ్యూహాలు రచించనున్నారు.