Begin typing your search above and press return to search.
భక్తి మార్గంలో జగన్...పీఠాల సందర్శనలో బిజీ
By: Tupaki Desk | 9 Feb 2022 11:46 AM GMTఏపీ సీఎం జగన్ లో ఇంత భక్తి ఉందా అని అంతా ఆసక్తిగా చర్చించుకునే పరిస్థితి. జగన్ ఒక రోజు తేడాలో రెండు ఆధ్యాత్మిక కేంద్రాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాలు పంచుకుని తనలోని భక్తి భావనను బయటపెట్టుకున్నారు. హైదరాబాద్ లోని ముచ్చింతల్ లో సమతా మూర్తి విగ్రహన్ని సందర్శించి అక్కడ చిన జీయర్ స్వామి వారి ఆశీస్సులు అందుకున్న జగన్ ఇపుడు విశాఖ శారదాపీఠంలో పూజలకు హాజరయ్యారు.
విశాఖలోని శారదాపీఠంలో అయిరు రోజుల పాటు జరుగుతున్న రాజశ్యామల యోగంలో జగన్ పాలు పంచుకున్నారు. గన్నవరం నుంచి ఆయన విశాఖ బయలేరి వచ్చారు. మధ్యాహ్నం పన్నెండున్నర ప్రాంతంలో ఆయన విశాఖ చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా శారదాపీఠానికి చేరుకున్నారు.
అక్కడ జగన్ రాజశ్యామల హోమంలో పాలుపంచుకున్నారు. అదే విధంగా పండిత సభలో కూడా పాల్గొని వేద విద్యార్ధులకు ఆయన సర్టిఫికేట్లను పంపిణీ చేశారు. ప్రతీ ఏటా శారదాపీఠం వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతాయి. దానికి క్రమం తప్పకుండా జగన్ హాజరవుతున్నారు.
ఈ సందర్భంగా ఆశ్రమంలో జరిగే పూజలలో కూడా ఆయన పాలు పంచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇక రాజశ్యామల హోమం చేసిన వారికి అధికార సిద్ధి లభిస్తుందని, అధికారంలో ఉన్న వారికి అది చిరకాలం ఉంటుందని చెబుతారు. జగన్ సీఎం కావడానికి ఈ హోమం కూడా ఒక కారణం అంటారు.
మొత్తానికి శారదాపీఠంతో జగన్ కి చాలా కాలంగా అనుబంధం ఉంది. శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి రుషీకేశ్ లో ఉన్నపుడు జగన్ అక్కడికి వెళ్ళి మరీ గంగ స్నానం ఆచరించి స్వామి చెప్పిన తీరున పలు పూజల్లో పాల్గొన్నారు. ఇక జగన్ పాదయాత్రకు ముందు కూడా పూజలు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత కూడాసీఎం హోదాలో తొలిసారి పీఠానికి వచ్చారు.
ఇక విధంగా స్వామీజీ జగన్ కి ఆధ్యాత్మిక సలహాలు ఇస్తారని అంటారు. స్వామి మాట మేరకు జగన్ శారదాపీఠానికి తరచూ వస్తూంటారు. ఈసారి జగన్ రాక సందర్భంగా పోలీసులు అన్ని ఏర్పాట్లూ చేశారు. జగన్ సైతం దాదాపు రెండున్నర గంటల పాటు అక్కడ గడిపారు. మొత్తానికి ఎలాంటి అధికారిక కార్యక్రమం లేకుండా జగన్ విశాఖ పర్యటన సాగడం విశేషం.