Begin typing your search above and press return to search.

భారత్ పై పిచ్చి ఆరోపణలు, చెత్త రాతలు!

By:  Tupaki Desk   |   25 Aug 2016 6:15 AM GMT
భారత్ పై పిచ్చి ఆరోపణలు, చెత్త రాతలు!
X
విశ్వక్రీడల వేదిక ఒలింపిక్స్ లో భారత్ కు దక్కిన పతకాలు రెండే కావడంతో.. ఈ విషయంలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మాత్రం దానికే అంత హడావిడి దేనికి - రెండు పతకాలొచ్చిన మనమే ఇంత హడావిడి చేస్తే అమెరికా - చైనా లు ఇంకెంత హడావిడి చేయాలాని కొందరు వ్యాఖ్యానిస్తుంటే.. చిరపుంజి వంటి ప్రాంతాల్లో వర్షం పడితే పెద్ద విషయం కాదు - ఎడారిప్రాంతంలో కురిసే రెండు చినుకులైనా ఎంతో గొప్ప ఆనందం కలిగిస్తాయని మరికొందరు ఆ వాదనలను తిప్పికొడుతున్నారు. అయితే ఈ విషయాలపై ప్రపంచ దేశాల పత్రికలు కూడా కొన్ని పిచ్చి రాతలు రాస్తున్నాయి.

120 కోట్ల జనాభా కలిగిన దేశం - ప్రపంచ అగ్రదేశాలకు దీటుగా జీడీపీని కలిగి ఉన్న దేశం.. ఒలింపిక్స్‌ లో మాత్రం రెండే పతకాలు దక్కించుకుంది. పైగా ఈ రెండు పతకాలైనా దక్కినందుకు దేశవ్యాప్తంగా సంబరాలు.. ఒక్కమాటలో చెప్పాలంటే "రియో ఒలింపిక్స్‌ లో భారత్‌ దే అత్యంత చెత్త ప్రదర్శన" అని న్యూజిల్యాండ్‌ దినపత్రిక న్యూజిలాండ్ హెలార్ల్డ్ "ఒలింపిక్స్ ఇండియా వరెస్ట్ కంట్రీ" అనే శీర్షిక తో ఒక కథనాన్ని వండి వార్చింది. ఈ పిచ్చి రాతల సంగతి అలా ఉంటే.. ప్రముఖ బ్రిటిష్‌ జర్నలిస్టు పీయర్స్‌ మోర్గాన్‌ ట్విట్టర్‌ లో చెత్త రాతలు రాశాడు. "120 కోట్ల జనాభా కలిగిన దేశం కేవలం రెండంటే రెండే పతకాలు తెచ్చుకున్నందుకు సంబురాలు జరుపుకొంటోంది.. ఎంత చికాకు కలిగించే విషయమిది" అంటూ మోర్గాన్‌ ట్వీట్టర్లో పేర్కొన్నాడు.

ఈ విషయంపై భారతీయ నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అసలు మా దేశం గురించి మీకెందుకు, మీ సొంత పనేంటో మీరు చూసుకోండి.. ఎవరైనా, ఏదైనా సాధించినప్పుడు సంబురాలు చేసుకోవడం మీ సంస్కృతిలో చికాకు కలిగించే విషయం కావొచ్చుకానీ - మా దేశ సంస్కృతిలో అది గొప్ప విషయం అంటూ గట్టిగానే సమాధానం చెప్పారు. ఇదే సమయంలో ఒక్క పతకం కూడా గెలువకుండా ఇంటిముఖం పట్టిన పాకిస్థాన్‌ ను అసలు లెక్కలోకే రాని దేశంగా ఈ పత్రిక ఏకిపారేసింది. ఏది ఏమైనా... ఇలాంటి ఆరోపణలను మాటల్తో కాకుండా, చేతలతో తిప్పికొట్టేరోజు మనకు రావాలని కోరుకుందాం!