Begin typing your search above and press return to search.
పాక్ నుంచి ఎగిరొచ్చిన పావురం!
By: Tupaki Desk | 24 Sep 2016 5:06 AM GMTయురి ఉగ్రదాడి అనంతరం ప్రతివిషయంలోనూ ఆందోళన, అనుమానం కలుగుతున్న నేపత్యంలో తాజాగా ఒక పావురం పంజాబ్ లో కలకలం సృష్టించింది. పావురాన్ని చూస్తే కంగారేమిటి - అది సృష్టించే కలకలం ఏమిటి అనుకుంటున్నరా? ఆది మామూలు తెల్లపావురం కాదు.. దాని రెక్కలపై ఉర్దూ బాషలో ఏవో అక్షరాలు రాసి ఉన్నాయి. అయితే ఈ విషయం గ్రహించిన హోషయాపూర్ జిల్లా మెట్లా గ్రామానికి చెందిన వ్యక్తి ఇంటిజిలెన్స్ అధికారులకు సమాచారం అందించాడు. అయితే... ఈ పావురాన్ని పరిశీలించిన అధికారులు ఇది ఇండియా - పాక్ బొర్డర్ ను దాటివచ్చినట్లు అనుమానిస్తున్నారు.
ఇలా పంజాబ్ లో దొరికిన ఈ పావురాన్ని అదుపులోకి తీసుకున్న అధికారులు... దాని రెక్కలపై ఉర్దూలో రాసి ఉన్న అక్షరాలను పరిశీలించారు. అనంతరం ఎందుకైనా మంచిదని ఆ పావురానికి స్కానింగ్ పరీక్ష కూడా చేయించారు. అయితే ఈ రెక్కలపై ఉన్న పదకొండు అంకెలను రహస్యంగా చేరవేసిన ఫోన్ నెంబరా.. లేక ఏదైనా సీక్రెట్ కోడా.. ఈ పావురం పాక్ నుంచి వచ్చిందా.. అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుంది.
అయితే ఈ రెక్కలపై ఉన్న ఉర్దూ అక్షరాలను తర్జుమా చేయించగా... వాటి అర్ధం ఆదివారం - బుధవారం - గురువారం అని రాసి ఉందని అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో రెక్కలపై అంకెలు - ఉర్దూ అక్షరలాతో పాటు ఒక స్టాంప్ ముద్రకూడా ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ పావురంపై అదికారులు రకరకాల కోణాల్లో ఆలోచిస్తున్నారు. కాగా... గత ఏడాది కూడా పఠాన్ కోట్ లో ఇలాగే రెక్కలపై ఉర్దూలో రాసిఉన్న పావురాన్ని గుర్తించారు. అనంతరం పఠాన్ కోట్ లోని ఎయిర్ ఫోర్స్ బేస్ పై ముష్కరుల దాడి జరిగిన సంగతి తెలిసిందే!