Begin typing your search above and press return to search.
పాక్ నుంచి మోడీకి పావురం లేఖ!
By: Tupaki Desk | 3 Oct 2016 4:27 AM GMTఎవరు చేస్తున్నారో తెలియదు కానీ... చిల్లర పనులు పుష్కలంగా చేస్తుంది పాక్. ఇది పాక్ సైన్యం పనా, పాక్ ఉగ్రవాదుల పనా లేక రేపటి ఉగ్రవాదుల పనా? బుడగలతో బెదిరింపు లేఖలు, వాఘా సరిహద్దుల్లో రాళ్లు విసరడాలు... ఇలాంటి చిల్లర పనులకు పాల్పడిన పాక్ - తాజాగా ప్రధాని నరేంద్ర మోడీని బెదిరిస్తున్నట్లు ఫీలవుతూ ఒక లేఖ రాసింది! అది వాళ్ల స్థాయిలో బెదిరింపే అవ్వొచ్చేమో కానీ, ఆ బెదిరింపు లేఖ చదివితే మాత్రం భారతీయుడికి హాస్యం అనిపిస్తుంది. ఈ లేఖను మోడీ కి ఒక పావురం కాళ్లకు కట్టి పంపింది పాక్!
తాజాగా పంజాబ్ - పాకిస్థాన్ సరిహద్దు వద్ద పావురం లేఖలు కలకలం రేపుతున్నాయి. పఠాన్ కోట్ సమీపంలోని బమియాల్ సెక్టార్ లోగల సింబాల్ పోస్ట్ వద్ద.. పాకిస్థాన్ వైపు నుంచి ఎగురుకుంటూ వచ్చిన బూడిద రంగు పావురాన్ని ఆదివారం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు గుర్తించారు. ఆ పావురం కాళ్లకు ఒక లేఖ కట్టి ఉంది. ఆ లేఖలో ఉర్దూ భాషలో కొన్ని వ్యాక్యాలు ఉన్నాయి. ఈ లేఖలో భారత ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ... "మోడీజీ మీ(ఇండియా)తో యుద్ధం చేయడానికి ఇక్కడి(పాకిస్థాన్) యువకులందరూ సిద్ధంగా ఉన్నారు. మమ్మల్ని నాటి(1971 యుద్ధం)వాళ్లలా లెక్కకట్టకండి..." అని రాసి ఉన్నట్లు పంజాబ్ పోలీసులు చెబుతున్నారు.
కాగా ఇప్పటికే గురుదాస్ పూర్ లోని ఘేసల్ గ్రామంవద్ద గాలి బుడగలకు కట్టిన లేఖలు పాకిస్థాన్ నుంచి ఇండియాకు వచ్చి వాలాయి. ఆ లేఖలో... "మోడీజీ - సహనం అనే కత్తులు మా దగ్గర ఉన్నాయి" అని ఉర్దూలో రాసిఉన్నట్లు అధికారులు చెప్పారు. ఇదే క్రమంలో సెప్టెంబర్ 23న కూడా పంజాబ్‌లో ఉర్దూలో రాసి ఉన్న ఉత్తరంతో ఉన్న ఒక తెల్ల పావురాన్ని భారత అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/