Begin typing your search above and press return to search.
జయ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలట
By: Tupaki Desk | 13 Dec 2016 8:44 AM GMTతమిళనాడు దివంగత సీఎం జయలలితకు వేల కోట్ల విలువైన ఆస్తులున్న విషయం తెలిసిందే. కేవలం తమిళనాడులోనే కాకుండా బెంగళూరు - హైదరాబాదులోనూ ఆమెకు విలువైన స్థిరాస్తులున్నాయి. అయితే జయ కుటుంబీకులెవరూ లేకపోవడంతో అవన్నీ ఆమె నెచ్చెలి శశికళకే చెందుతాయని భావిస్తున్నారు. అయితే.. హైదరాబాద్ కు చెందిన ఓ సంస్థ మాత్రం... అలా సంబంధం లేని వ్యక్తులకు జయ ఆస్తులు ఇవ్వనవసరం లేదని.. మిగతా చోట్ల ఉన్న ఆస్తుల మాటెలా ఉన్నా హైదరాబాద్ లోని ఆస్తులను మాత్రం తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు.
జయు హైదరాబాదులో సైతం కోట్లాది రూపాయల విలువ చేసే ఆస్తులు ఆమెకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ లో కూడా ఆమె తన ఆస్తుల విలువను రూ. 113.73 కోట్లుగా ప్రకటించారు. ఇందులో హైదరాబాదులోని మేడ్చల్ లో 14 ఎకరాల ఫాంహౌస్ - శ్రీనగర్ కాలనీలో కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, హైదరాబాదులోని జయ ఆస్తులపై గరీబ్ గైడ్ అనే ఓ స్వంచ్ఛంద సంస్థ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసింది.
జయలలిత తల్లిదండ్రులు ఎప్పుడో చనిపోయారని... ఆమె సోదరుడు జయకుమార్ కూడా 1995లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని... దీంతో, ఆమె ఆస్తులను పొందే వ్యక్తులు ఎవరూ లేరని గరీబ్ గైడ్ తన పిల్ లో పేర్కొంది. శశికళకు జయలలిత ఆస్తులు పొందే హక్కు ఏమాత్రం లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో, నగరంలోని జయ ఆస్తులను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పబ్లిక్ ప్రాపర్టీగా ప్రకటించాలని ఆ పిటిషన్ లో కోరింది
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/