Begin typing your search above and press return to search.

మండ‌లి ర‌ద్దైతే.. జ‌గ‌న్ కేబినెట్లో ఇద్ద‌రు ఔట్!

By:  Tupaki Desk   |   24 Jan 2020 2:30 PM GMT
మండ‌లి ర‌ద్దైతే.. జ‌గ‌న్ కేబినెట్లో ఇద్ద‌రు ఔట్!
X
ఏపీ లో శాస‌న‌మండ‌లి ర‌ద్దు అయితే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి కూడా కొన్ని ఇబ్బందులు త‌ప్ప‌క‌వ‌చ్చు. అందులో ముఖ్య‌మైన‌వి రాజ‌కీయ నిరుద్యోగుల‌ను స‌మాధాన ప‌ర‌చ‌డం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ ప‌ద‌వుల‌ను న‌మ్ముకున్న వాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. అక్క‌డ‌కూ ఆ పార్టీ 151 మంది ఎమ్మెల్యేల‌ను క‌లిగి ఉంది. మెజారిటీ నేత‌లంతా ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కాబ‌ట్టి కొంత ఇబ్బంది లేదు. అయితే ఇంకా అనేక మంది నేత‌లు ఎమ్మెల్సీ ఆశ‌ల‌తో ఉన్నారు. ఎన్నిక‌ల్లో ఓడిన వారు, ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ని వారు అలా ఎమ్మెల్సీ ప‌ద‌వుల మీద ఆశ‌తో ఉన్నారు.

వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కేబినెట్లో కూడా ఇద్ద‌రు ఇప్పుడు ఎమ్మెల్సీ హోదాలతోనే మంత్రులుగా ఉన్నారు. వారే పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ - మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌. వీరిద్ద‌రూ ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయిన ఒక‌ద‌శ‌లో వారు త‌న కోసం మంత్రి ప‌ద‌వులు కోల్పోయారు అనే భావ‌న‌తో వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వారికి మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. ఎమ్మెల్యేలుగా ఓడిపోయినా..వారిని మంత్రుల‌ను చేశారు. అప్ప‌టికే పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ ఎమ్మెల్సీగా ఉండేవారు. దీంతో ఆయ‌న మంత్రి కావ‌డం ఈజీ అయ్యింది.

మంత్రి ప‌ద‌వి ఇచ్చాకా మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌ను ఎమ్మెల్సీగా చేశారు. ఇలా వారిద్ద‌రూ ఎమ్మెల్సీ హోదాల‌తో మంత్రి ప‌ద‌వి హోదాల‌ను పొందారు. కొన‌సాగుతూ ఉన్నారు. ఇప్పుడు ఉన్న‌ఫ‌లంగా మండ‌లి ర‌ద్దు అయిపోతే వారికి ఇబ్బంది త‌ప్ప‌దు. వారు మంత్రి ప‌ద‌వుల‌ను కోల్పోవాల్సి ఉంటుంది. త‌క్ష‌ణం కాక‌పోయినా.. ఆరు నెల‌ల్లో అయినా వారు మంత్రి ప‌ద‌వుల‌ను వీడాల్సి ఉంటుంది. కాబ‌ట్టి..మండ‌లి ర‌ద్దు అయిదే ఇద్ద‌రు మంత్రి ప‌ద‌వుల‌ను కోల్పోతున్న‌టట్టే.

ఆస‌క్తిదాయ‌క‌మైన అంశం ఏమిటంటే.. మండ‌లిని ర‌ద్దు చేయాల‌ని శాస‌న‌స‌భ‌లో ప్రసంగించారు పిల్లి సుభాష్ చంద్ర‌బోస్. అలాగే మోపిదేవి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం.