Begin typing your search above and press return to search.

విమానం నడుపుతూ నిద్రలోకి జారుకున్న పైలెట్.. అసలేమైందంటే?

By:  Tupaki Desk   |   1 Jun 2022 2:30 AM GMT
విమానం నడుపుతూ నిద్రలోకి జారుకున్న పైలెట్.. అసలేమైందంటే?
X
ప్రతి మనిషికి తిండి, నిద్ర చాలా అవసరం. మరీ ముఖ్యంగా విమానాలు నడిపే పైలెట్ కు అయితే మరీ అవసరం. ఈ రెండు కానీ లేకపోతే ఎవరూ కూడా సరిగ్గా పనిచేయలేరు. ఓ పైలెట్ నిద్ర లేకపోవడంతో విమానం నడుపుతూనే నిద్రపోయాడు. అంత ఎత్తులో ఏకంగా 10 నిమిషాలపు నిద్రపోయాడు. విమానానికి ఏదైనా అయితే పెను ప్రమాదం వాటిల్లేది.

ఆకాశంలో అత్యంత ఎత్తున విమానం నడుపుతున్న పైలెట్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం తేడా కొట్టినా వందల మంది ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి. పైలెట్లను అందుకే ఎప్పుడూ లైవ్ లో ఉండేలా కిందనున్న విమానాశ్రయాల నుంచి సంకేతాలు పంపుతుంటారు.

తాజాగా ఇటలీకి చెందిన ఓ విమానం న్యూయార్క్ నుంచి రోమ్ కు వస్తోంది. ఈ ఐటీఏ ఎయిర్ లైన్స్ కు చెందిన ఏజెడ్ 609 విమానం నడుపుతూ కాక్ పిట్ లోనే ఓ పైలెట్ నిద్రలోకి జారుకున్నాడు. పైలెట్ నిర్వాకం కారణంగా విమానం నుంచి 10 నిమిషాల పాటు ఎటువంటి కమ్యూనికేషన్ జరగలేదు. దీంతో ఫ్రాన్స్ అధికారులు ఉగ్రదాడి అలెర్ట్ ను ప్రకటించాల్సి వచ్చింది.

అయితే తాను నిద్రపోలేదని.. విమానంలో కీలక వ్యవస్థలు పనిచేయకపోవడంతోనే కమ్యూనికేషన్ సాధ్యం కాలేదని పై అధికారులకు పైలెట్ వివరణ ఇచ్చాడు. కానీ ప్రాథమిక దర్యాప్తు తర్వాత అతడు అబద్దం చెప్పినట్లు తేలింది.

ఈ ఎయిర్ బస్ విమానాన్ని ఆటో పైలెట్ లో పెట్టి కోపైలెట్ కూడా నిద్రలోకి జారుకోవడంతో కొంత సేపు విమానంతో కమ్యూనికేషన్ సాధ్యం కాలేదు. దీంతో గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ లో ఆందోళన వ్యక్తమైంది. ఒక దశలో రెండు ఫ్రెంచ్ జెట్ విమానాలు కూడా ఈ విమానంపైకి నిఘా కోసం పంపించారు.

అయితే విమానం ఆటోపైలెట్ మోడ్ లో ఉండడంతో సురక్షితంగా ప్రయాణించినట్లు ఎయిర్ లైన్స్ సంస్థ ప్రతినిధి ప్రకటించారు.