Begin typing your search above and press return to search.

విమానాల‌కు కొత్త షాక్‌...ఇది క‌రోనా అంత‌టి డేంజ‌ర్‌

By:  Tupaki Desk   |   29 May 2020 3:30 PM GMT
విమానాల‌కు కొత్త షాక్‌...ఇది క‌రోనా అంత‌టి డేంజ‌ర్‌
X
సుదూర ప్రాంతాల నుంచి ప్ర‌యాణిస్తూ...మ‌న‌దేశంలో క‌ల‌వ‌రం సృష్టిస్తున్న మిడ‌త‌ల దండు విష‌యంలో మ‌రో షాకింగ్ వార్త తెర‌మీద‌కు వ‌చ్చింది. దేశం యావ‌త్తు క‌రోనాతో పోరాడుతున్న వేళ మిడ‌త‌ల రూపంలో మ‌రో స‌మ‌స్య వ‌చ్చిప‌డింది. ఇప్ప‌టికే మిడ‌త‌లు దేశంలోని రాజస్థాన్‌, పంజాబ్‌, గుజ‌రాత్, మ‌హారాష్ట్ర‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో ప్ర‌వేశించాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ వీటి ఆన‌వాళ్లు క‌నిపిస్తున్నాయి. ఈ స‌మ‌యంలోనే క‌రోనాను మించిన స‌మ‌స్య ఈ మిడ‌త‌ల‌తో రానుంద‌ట‌. విమాన ప్ర‌యాణాల‌కు తీవ్ర ముప్పుగా మార‌నున్నాయ‌ని తాజాగా హెచ్చ‌రిక‌లు విడుద‌ల అయ్యాయి.

భార‌త్‌లో ప్ర‌వేశించిన మిడ‌త‌ల దండువ‌ల్ల‌ పంట‌లకు న‌ష్టం వాటిళ్లిన సంగ‌తి తెలిసిందే. దీంతో పాటుగా ఇంకో షాక్ తాజాగా తెర‌మీద‌కు వ‌చ్చింది. మిడ‌త‌లు విమానాల‌కు కూడా ముప్పు త‌‌ల‌పెట్ట‌నున్నాయ‌ని డైరెక్ట‌రేట్‌ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ (DGCA) ప్ర‌క‌టించింది. విమానాలు టేకాఫ్ తీసుకునేట‌ప్పుడు, ల్యాండింగ్ అయ్యేట‌ప్పుడు మిడ‌త‌లు దండు వ‌స్తే స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌వుతాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఈ నేప‌థ్యంలో మిడ‌త‌ల దండు విష‌యంలో పైలెట్‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని DGCA సూచించింది. ఈ మేర‌కు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై పైలెట్లు, ఇంజినీర్ల‌కు DGCA మార్గ‌ద‌ర్శ‌కాలను విడుద‌ల చేసింది. మిడతలు గాల్లో కనిపించినప్పుడు ఎలా వ్యవహరించాలి, ఎంత దూరం నుండి వాటి ప్రయాణాన్ని కనుక్కోవాలి అనే అంశాలపై శిక్షణ ఇచ్చే దిశగా విమానయాన సంస్థ సన్నాహాలు చేస్తోంది. మ‌రోవైపు ఇప్ప‌టికే, ఎయిర్ కంట్రోల్ ట్రాఫిక్ సిబ్బందికి ఈ కీట‌కాల విష‌యంలో అల‌ర్ట్ చేసే బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించింది.

ఆఫ్రికా దేశాల నుంచి గ‌ల్ఫ్, పాకిస్థాన్ మీదుగా దేశవ్యాప్తంగా దూసుకొస్తున్న మిడతల దండు ఏప్రిల్‌ 11న పాకిస్థాన్‌ నుంచి రాజస్థాన్‌లోకి ప్రవేశించింది. ఈ మిడతల దండు, గత కొన్ని రోజుల్లో పంజాబ్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీకి విస్తరించాయి. కాగా, దీనిపై దండయాత్రకు కేంద్రం సన్నద్ధమైంది. వీటి నియంత్రణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. 60 ప్రత్యేక స్ప్రేయర్ల కోసం బ్రిటన్‌ సంస్థ మిక్రాన్‌కు ఆర్డర్‌ ఇచ్చింది. అలాగే డ్రోన్ల సరఫరా కోసం రెండు సంస్థలను ఖరారు చేసింది.