Begin typing your search above and press return to search.

కేరళలో సీన్​రిపీట్​.. మళ్లీ ఆంక్షలు..కాలు కదిపితే.. లాఠీ విరగడమే!

By:  Tupaki Desk   |   6 Nov 2020 3:30 PM GMT
కేరళలో సీన్​రిపీట్​.. మళ్లీ ఆంక్షలు..కాలు కదిపితే.. లాఠీ విరగడమే!
X
ప్రారంభంలో కరోనా కట్టడికి కేరళ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. టెస్టింగ్​, ట్రేసింగ్​, ట్రీటింగ్​ అనే విధానాన్ని ఆ రాష్ట్రం కఠినంగా అమలు చేసింది. దీంతో కేసుల సంఖ్య క్రమంగా తగ్గింది. కేరళలో కరోనా కట్టడికి అవలంభిస్తున్న విధానాలపై అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. కానీ ఓనం వేడుకలు కేరళ కొంపముంచాయి. కరోనా కేసుల సంఖ్య మళ్లీ మొదటికొచ్చింది. ఆ రాష్ట్రంలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో మళ్లీ కేరళ రాష్ట్రం సంపూర్ణ లాక్​డౌన్​ దిశగా అడుగులు వేస్తున్నది. ప్రస్తుతం ఆ రాష్ట్ర ప్రభుత్వం కరోనాకట్టడిపై కఠినంగా వ్యవహరిస్తున్నది. చట్టాల్ని కఠినంగా అమలు చేస్తోంది. ఓనం తర్వాత కేసుల సంఖ్య పెరగడంతో సీఎం పినరయి విజయన్ కరోనా కట్టడిపై మరోసారి దృష్టి సారించారు.

ప్రస్తుతం ఆ రాష్ట్రంలో సెక్షన్ 144, 151, 149 వంటి చట్టాలను కఠినంగా అమలు అవుతున్నాయి. ఈ చట్టాల ప్రకారం ప్రజలు ఎక్కడైనా గుమిగూడితే పోలీసులు లాఠీలకు పనిచెబుతున్నారు. సభలు, సమావేశాలకు, వేడుకలకు అనుమతులు ఇవ్వడం లేదు. అయితే కేరళ ప్రభుత్వ తీరుపై విమర్శలు కూడా వస్తున్నాయి. ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఎందుకింత కఠినంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానీ ప్రజల ఆరోగ్యం విషయంలో రాజీపడే మాటే లేదని సీఎం విజయన్​ కఠిన విధానాలనే అవలంభిస్తున్నారు. 151, 149 సెక్షన్లు అమలులో ఉన్న క్రమంలో పోలీసులకు ప్రత్యేక అధికారాలు ఉంటాయి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని భావిస్తే..స్థానిక మెజిస్ట్రేట్ పర్మిషన్ గానీ.. కనీసం వారంట్ అవసరం కూడా లేకుండానే వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేయవచ్చు.సెక్షన్ 144 అమలులో ఉంటే..ఒకేచోట ముగ్గురి కంటే ఎక్కువమంది గుమికూడి ఉండకూడదు. దీంతో ఈ చట్టాల అమలుపై వ్యతిరేకత వస్తోంది.