Begin typing your search above and press return to search.
క్రికెట్ పిచ్ మీద ‘పింక్’ ప్రకంపనలు
By: Tupaki Desk | 25 Oct 2015 3:19 AM GMTక్రికెట్ క్రీడా ప్రపంచంలో ఇప్పుడ పింక్ బాల్ వ్యవహారం పెద్ద రచ్చ చేస్తోంది. ప్రతిష్ఠాత్మక ఆసీస్.. న్యూజిలాండ్ సిరీస్ సందర్భంగా పింక్ బంతి వినియోగంపై మొదలైన వేడి రోజురోజుకీ మరింత పెరుగుతోంది. పింక్ బాల్ వినియోగంపై భిన్న వాదనలు వినిపించటమే దీనికి కారణం.
నవంబరు 27 నుంచి డిసెంబర్ 1 వరకూ ఆడిలైట్ ఓవల్ లో డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ కు ప్రత్యేకత ఏమిటంటే.. అంతర్జాతీయంగా డే అండ్ నైట్ టెస్ట్ లు జరిగినా.. అంతర్జాతీయంగా మాత్రం తొలి మ్యాచ్ జరగటం. తొలి అంతర్జాతీయ డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ గురించి సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతుంటే.. ఈ మ్యాచ్ కు సంబంధించిన ఒక వివాదం రోజురోజుకీ ముదురుతోంది.
ఈ మ్యాచ్ లో పింక్ బంతిని వినియోగించాలని నిర్ణయించారు. అయితే.. ధీనిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పింక్ బంతి సరైన ఫలితం ఇవ్వటం లేదని ఆసీస్ ఆటగాడు ఆడమ్ వోజస్ తన అసంతృప్తిని బహిరంగంగానే వెల్లడించేశాడు. తన అసంతృప్తికి కారణం చెబుతూ.. 30 ఓవర్లకే పింక్ బాల్ మీద కోటింగ్ పోయి సరిగా కనిపించట్లేదని.. అలాంటప్పుడు రోజుకు 95 ఓవర్లు వరకు వేసే టెస్ట్ మ్యాచ్ లకు పింక్ బంతి ఎలా వినియోగిస్తారని ప్రశ్నిస్తున్నారు.
పింక్ బంతి మొదట బాగానే ఉన్నా.. రానురాను ఆ బంతి మెత్తపడిపోతుందంటూ వోజస్ మరో ఉదాహరణ చెప్పుకొచ్చాడు. పింక్ బంతిని వినియోగించే ఆరంభ కార్యక్రమంలో ప్రైమ్ మినిస్టర్స్ బౌలర్ అస్టోన్ ఆగన్ వేసిన బంతిని న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గుప్తిల్ మిడ్ వికెట్ మీదుగా బంతిని కొడితే.. అది ఎటువైపు వెళ్లిందో కూడా తెలియదన్న ఆందోలన వ్యక్తం చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో పింక్ బంతిని వినియోగించటం సరైందా? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. మరి.. తొలి అంతర్జాతీయ డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ లో పింక్ వినియోగం మీదున్న అభ్యంతరాలపై తుది నిర్ణయం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.